జిల్లాలో 500 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు
బలిజిపేట రూరల్ : జిల్లాలో సుమారు 500 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి జి.కృష్ణారావు తెలిపారు. చిలకలపల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తన ను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 500 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ద్వారా ఇవి భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. జిల్లాలో 550 ప్రైవేటు, 2294 ప్రాథమిక, 248 ప్రాథమిక, 321 ప్రభుత్వ సంబంధమైన అన్ని రకాల ఉన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలల్లో 90 వేల మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. 34 మండలాలకు విద్యాశాఖాధికారులు లేరని, మౌలిక సదుపాయూ ల కొరత పాఠశాలలకు ఉందన్నారు. పాఠశాలల్లో మరుగు దొడ్ల సక్రమ నిర్వహణ బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని చెప్పారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. జీఓ నంబరు 55 ప్రకారం జిల్లాలో ఉపాధ్యాయుల, విద్యార్థుల సంఖ్య గణాంకాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీని ప్రకారం అవసరాలను గుర్తిస్తామన్నారు. ఈ ఏడాది పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.