వసూళ్ల బడి
వసూళ్ల బడి
Published Thu, Jul 28 2016 6:10 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
ఆరు నుంచి ఎనిమిది వరకు రూ.30
పదో తరగతికి రూ.100
బలిజిపేట ఉన్నత పాఠశాలలో వసూళ్లు
విద్యార్థుల ఆందోళన
బలిజిపేట రూరల్: బలిజిపేట ఉన్నత పాఠశాల విద్యార్థుల నుంచి రుసుము రూపంలో నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలిజిపేట ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 720 మంది చదువుతున్నారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రూ.30 వసూలు చేస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. 9, 10వ తరగతులకు ఎస్–1, ఎస్–2 పేపర్లకు రూ.30, ప్రత్యేక రుసుముగా రూ.20, ఆటలకు రూ.15 కలిపి మొత్తం రూ.65 వసూలు చేయాల్సి ఉండగా రూ.100 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనికి ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడం గమనార్హం.
రూ.100 వసూలు చేశారు: అరసాడ వంశీ
బలిజిపేట ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నా నుంచి రూ.100 వసూలు చేశారు. 6,7 తరగతి విద్యార్థుల నుంచి రూ.30 వసూలు చేశారు.
విద్యార్థుల కోసమే: జె.త్రినాథ, ప్రధానోపాధ్యాయుడు
విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది వారి సౌకర్యార్థమే. విద్యార్థులకు పరీక్ష పత్రాలు, స్టడీ మెటీరియల్ అందించేందుకు వసూలు చేస్తున్నాం. ఇది అనధికారికమే.
Advertisement