133 మందికి మూడున్నర కిలోల పప్పు
133 మందికి మూడున్నర కిలోల పప్పు
Published Thu, Jul 21 2016 5:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
కస్తూర్బా పాఠశాలలో సాంబారు తయారీ
నిర్వాహకులపై మండిపడ్డ ఎంపీపీ పార్వతి
బలిజిపేట రూరల్ :బలిజిపేట కస్తూర్బా పాఠశాలను ఎంపీపీ పెంకి పార్వతి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వంటకాలను పరిశీలించినప్పుడు తక్కువ పప్పు కనిపించడంతో నిర్వాహకులపై మండిపడ్డారు. పాఠశాలలో 140మంది విద్యార్థులుండగా 133మంది హాజరైనట్టు వారు తెలిపారు. ఎంత కందిపప్పు వినియోగించారని ప్రశ్నించగా మూడున్నర కిలోలు వినియోగించనట్టు వంటవారు తెలిపారు. రాత్రి వడ్డించే సాంబారుకు కలిపి మొత్తం ఇదే పప్పు అని వారు తెలిపారు. దీంతో 133మందికి ఎలా సరిపోతుందని, అసలు ఎంత పప్పు వడ్డించాలని ప్రశ్నించారు. పాఠశాల ప్రిన్సిపాల్ హరిత సమావేశానికి వెళ్ళిపోవడంతో సిబ్బంది సరైన సమాచారం లేక నీళ్లు నమిలారు. చాలీచాలని వంటకాలు వండి విద్యార్థులకు అన్యాయం చేయడం తగదని హెచ్చరించారు. మజ్జిగ పలచగా ఉందని, ఎన్ని లీటర్ల పాలు కొంటున్నారని ప్రశ్నించారు. ముప్ఫయ్ రెండు లీటర్ల పాలు కొంటున్నట్టు సిబ్బంది తెలిపారు. వంటకాలు, పాఠశాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో రామకష్ణ, వెంకటినాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement