Censorship Controversy
-
చైనా ఫోన్లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ
దేశంలో చైనా స్మార్ట్ ఫోన్ లు కనిపిస్తే చాలు విసిరికొట్టండి. వాటిని వినియోగించడానికి వీల్లేదంటూ ఓ దేశానికి చెందిన రక్షణ శాఖ ఆ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. చైనా ఫోన్లతో పాటు షావోమీ, హువావే ఫోన్ల వినియోగం నిలిపివేయాలని స్పష్టం చేసింది. అందుకు కారణం ఏదైనా..ఆదేశ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని పలు దేశాలు చైనా చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ సైతం చైనా ప్రాడక్ట్‌లకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌లపై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్‌తో పాటు యూరప్ దేశాలకు చెందిన లుథువేనియా సైతం చైనాపై ఎదురు దాడికి దిగుతున్నాయి. చైనా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లలో సెన్సార్ షిప్ ఉందంటూ లుథువేనియా రక్షణశాఖ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ సెన్సార్ షిప్ వల్ల చైనా స్మార్ట్ ఫోన్లలో దేశానికి చెందిన 449 పదాలు అవుతున్నాయని ఆరోపించింది.ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్, డెమొక్రసీ మూవ్మెంట్ పదాల్ని బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ఫోన్లతో పాటు షియోమీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్లోనూ ఈ సెన్సార్షిప్ ఉందని ఆదేశ రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ దేశాదినేతలు చైనాతో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ షిప్ ఉన్న స్మార్ట్ ఫోన్ లను విసిరి పడేయండి' అని లిథుయేనియా రక్షణ శాఖ సహాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియస్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే లిథుయేనియా ఆరోపణలపై షియోమీ సంస్థ ఖండించింది.తమ ఫోన్లలో అలాంటి సెన్సార్షిప్ లేదని స్పష్టం చేసింది. చదవండి: తస్మాత్ జాగ్రత్త..ఈ స్మార్ట్ ఫోన్లు వారిని కనిపెట్టేస్తాయ్ -
సెన్సార్షిప్ అడ్డుపుల్లలు.. భగ్గుమంటున్న మేకర్లు
న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రం జారీ చేసిన సినిమాటోగ్రఫీ(సవరణ బిల్లు 2001)పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కొత్త సవరణల ప్రకారం.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) సర్టిఫై చేసిన సినిమాపై ఎవరైనా (ఒక్కరైనా సరే) అభ్యంతరం గనుక వ్యక్తం చేస్తే. మళ్లీ రీ సర్టిఫికేషన్ కోసం అడిగే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాదు పైరసీకి సంబంధించిన శిక్షలతో పాటు ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే సర్టిఫికెట్ గండం దాటేందుకు మేకర్లు నానా తంటాలు పడుతున్న టైంలో.. కొత్త సవరణలు పెద్దతలనొప్పిగా మారే అవకాశం ఉందని సినీ పెద్దలు భావిస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగల్ నేతృత్వంలోని కమిటీ గతంలో కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. ఏదైనా సినిమాను చూసే సభ్యులు దానికి ఏజ్ సర్టిఫికేట్ ఇవ్వాలే తప్ప.. సినిమాను సెన్సార్ చేసే హక్కు ఉండకూడదని కమిటీ సూచించింది. కానీ, కేంద్రం దానిని పెడచెవిన పెట్టింది. ఇప్పటికీ అభ్యంతరకరం పేరుతో దృశ్యాలను తొలగించడం, డైలాగులను మ్యూట్ చేయడం నడుస్తోంది. ఇక సీబీఎస్సీ రెండు ప్యానెల్లు(ఎగ్జామైనింగ్ కమిటీ, రివైజింగ్ కమిటి) గనుక సర్టిఫికేషన్‌ను నిరాకరిస్తే.. ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పలేట్ ట్రిబ్యునల్’ ఫిల్మ్ మేకర్లకు ఊరట ఇచ్చేది. కానీ, ఏప్రిల్‌లో ఆ ట్రిబ్యునల్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్రం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కత్తెరల పంచాయితీపై నిర్మాతలు ఇకపై కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కంట్రోల్ చేస్తున్నారా? ఇక సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952కు చేసిన తాజా సవరణలు చాలావరకు సినిమా రిలీజ్ టైంలో అడ్డుపడేందుకు వీలున్నవే. పైగా వ్యక్తిగత కక్క్ష్యలతో, రాజకీయ దురుద్దేశంతో అడ్డుతగిలే అవకాశం ఉందని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నారు. ఓటీటీకీ సెన్సార్, ఫీచర్ ఫిల్మ్ సెన్సార్ నిబంధనలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరోసారి తీసుకున్న నిర్ణయం పై పలువురు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. కేరళ మూవీ అకాడమీ చైర్పర్సన్ కమల, కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆనంద్ పట్వార్దాన్ తదితరులు తాజా నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ‘సినిమా తీసేవాళ్లను ఈవిధంగా నియంత్రించాలని చూస్తున్నారు.. ఇది రాజ్యాంగవిరుద్ధం’ అని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ మండిపడ్డాడు. ఈ విషయంపై తమిళనాడు దర్శకుల అసోషియేషన్ కార్యదర్శి ఆరే సెల్వమణితో మాట్లాడిన వెటట్రి.. బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశాడు. యుబైఎలోనూ వయసువారీగా.. ప్రధానంగా సినిమాలను ‘యు’, ‘యు/ఎ’, ‘ఎ’ ‘ఆర్’ సర్టిఫికెట్లుగా ఇస్తూ వస్తున్నారు. ‘యు’ అంటే అందరూ చూడదగ్గ చిత్రం, ‘యు / ఎ’ అంటే పెద్దల సమక్షంలో పిల్లలు చూడదగ్గ చిత్రం, ‘ఎ’ అంటే 18 సంవత్సరాల పైబడిన వారు చూడదగ్గ చిత్రం. అయితే తాజా సవరణలతో ‘యు/ఎ’ సర్టిఫికెట్‌నూ మూడు కేటగిరీలుగా విభజించారు. యు /ఎ 7 ప్లస్, యు /ఎ 13 ప్లస్, యు /ఎ 16 ప్లస్ అని. అంటే పెద్దల సమక్షంలో కూడా ఏడు సంవత్సరాలు, పదమూడు సంవత్సరాలు, పదహారు సంవత్సరాల పైబడ్డ వారు చూసే చిత్రాలుగా విజభించారు. సెన్సార్షిప్ అడ్డుపుల్లలతో ఫిల్మ్మేకర్లను గిచ్చిగిల్లుతున్న కేంద్రం.. మరోవైపు కొత్తసవరణలపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలువు ఇవ్వడం కొసమెరుపు. చదవండి: సెన్సార్.. సెన్సార్.. సెన్సార్ -
‘ఉడ్తా పంజాబ్’కు ఓకే
‘స్టే’కు సుప్రీంకోర్టు, పంజాబ్ - హరియాణా హైకోర్టు తిరస్కృతి చండీగఢ్: సెన్సార్షిప్ వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు అన్ని అడ్డంకులూ తొలిగాయి. ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు, పంజాబ్-హరియాణా హైకోర్టులు నిరాకరించాయి. దీంతో డ్రగ్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా.. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. దీని విడుదలపై స్టే విధించాలని హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమనిస్పష్టం చేసింది.దీనిపై పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఉందని పేర్కొంది. హైకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. అలాగే ఈ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా మరో పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైంది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ సినిమా ఆన్లైన్లో లీక్ కావడంపై సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ మండిపడ్డారు. పైరసీ కాపీ వివిధ టోరెంట్ వెబ్సైట్లలో దర్శనమిచ్చింది. ఇందులో ‘ఫర్ సెన్సార్’ అని ఉండటంతో లీక్‌లో సెన్సార్ బోర్డుకు ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఆన్లైన్ లీక్‌కు సంబంధించి వచ్చిన వార్తలను సీబీఎఫ్సీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ తోసిపుచ్చారు.