ఎన్కౌంటర్లపై నివేదికలివ్వండి: కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణలో ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత, ఆంధ్రప్రదేశ్లో 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ సంఘటనలపై కేంద్రం ఆరా తీసింది. ఇవి జరిగిన తీరును ఇప్పటికే తెలుసుకున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్ పూర్తి వివరాలతో నివేదికలు పంపాలని రెండు రాష్ట్రాల డీజీపీలను ఆదేశించిన ట్టు సమాచారం.