central notices
-
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్‌లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
ప్రధాని ఫొటోలు ఎందుకు వాడారు?
జియో, పేటీఎంలకు కేంద్రం నోటీసులు న్యూఢిల్లీ: జియో, పేటీఎంలు తమ ప్రకటనల్లో ప్రధానమంత్రి ఫొటోలను వినియోగించడంపై కేంద్రం స్పందించింది. ఇలా ఎందుకుచేశారని ప్రశ్నిస్తూ, నోటీసులు జారీ చేసింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే శుక్రవారంనాడు ఈ విషయాన్ని తెలిపారు. ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్(ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్) యాక్ట్ 1950 కింద నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత స్థాయి ప్రతి ష్టకు కస్టోడియన్‌గా వ్యవహరించే వినియోగ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ చట్టం కింద అత్యున్నత స్థాయి ప్రతిష్టను తగ్గించే చర్యలకు జరిమానా విధించే వీలుంది. తాజా పరిణామంపై ఈ–మెయిల్ ప్రశ్నలకు అటు జియో కానీ ఇటు పేటీఎంకానీ స్పందించలేదు. జియో తన 4జీ సేవల ప్రకటనలకు సంబంధించి ప్రధాని ఫొటోను వినియోగించుకుంది. ఇక పెద్ద నోట్ల రద్దు అనంతరం పేటీఎం ప్రకటనల్లో మోదీ ఫొటోలు చోటుచేసుకున్నాయి.