Central Officials
-
గ్రామీణాభివృద్ధిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును కేంద్రం ప్రశంసించింది. ఉపాధి హామీ పథకంతో పాటు పింఛన్ల పంపిణీ, భూ రికార్డుల ఆధునీకరణ, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల బృందం గతేడాది దేశంలోని 24 రాష్ట్రాల పరిధిలోని 233 జిల్లాల్లోని 2,330 గ్రామాల్లో పర్యటించింది. గతేడాది అక్టోబరులో మన రాష్ట్రంలోనూ నాలుగు జిల్లాల పరిధిలో 40 గ్రామాలను కేంద్ర అధికారులు సందర్శించారు. ఆ వివరాలతో ‘నేషనల్ లెవల్ మానిటరింగ్’ పేరుతో కేంద్రం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలోనూ, ఉపాధిహామీ అమలులోనూ ఏపీ వంద శాతం పనితీరు కనబరుస్తున్నదంటూ కేంద్ర అధికారులు ప్రశంసించారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చిన్నతా -
అప్పీళ్ల దాఖలులో మితిమీరిన జాప్యం
న్యూఢిల్లీ: అప్పీళ్లను దాఖలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మితిమీరిన ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నందుకు వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, ఆ మేరకు బాధ్యులైన అధికారుల నుంచి ఖర్చులు రాబడతామని హెచ్చరించింది. అప్పీళ్ల విషయంలో నిర్ణీత కాల పరిమితిని పట్టించుకోని ప్రభుత్వాధికారులకు సుప్రీం కోర్టు వేదిక కాదని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో అప్పీలు దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ అధికారులు 663 రోజుల సమయం తీసుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ‘ఇలా ఆలస్యం చేసి, ఆ అప్పీల్‌ను కొట్టివేసే పరిస్థితిని తీసుకురావడం, తద్వారా ఈ అంశాన్ని ఇంతటితో మరుగున పడేయటమే ఉద్దేశంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ‘అంతిమంగా బాధ్యులైన అధికారులు తప్పించుకుంటున్నారు. దీనిపై గతంలో పలు పర్యాయాలు హెచ్చరించినా మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లితే, సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలి’ అని తెలిపింది. అప్పీళ్ల విషయంలో తీవ్ర ఆలస్యానికి కారణం కావడంతోపాటు, న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసే అధికారుల నుంచి అందుకు తగ్గ ఖర్చులను వసూలు చేయాలి’ అని తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.25 వేలను వసూలు చేయాలని ఆదేశించింది. లేకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ధిక్కార చర్యలు తప్పవని తెలిపింది. -
కేంద్రానికి సహకరించని పశ్చిమబెంగాల్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోందని కోవిడ్–19 ప్రభావాన్ని అంచనా వేసేందుకు వచ్చిన రెండు కేంద్ర బృందాలు విమర్శించాయి. లాక్‌డౌన్‌ని కఠినంగా అమలుచేయాలని స్పష్టం చేశాయి. అలాగే తమ సభ్యుల రక్షణకు అధికార పార్టీ బాధ్యత వహిస్తుందా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కోల్‌కతా, సిలిగురిలో పర్యటిస్తోన్న బృందానికి అవసరమైన సమాచారం అందించడంలోనూ, ప్రభుత్వం నుంచి ఎదురైన సహాయనిరాకరణపై రెండు కేంద్ర బృందాలు ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ సిన్హాకి లేఖలు రాశాయి. ఇప్పటి వరకు నాలుగు లేఖలు రాశామనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తోన్న సీనియర్ అధికారి అపూర్వ చంద్ర చెప్పారు. కేంద్ర బృందం రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే స్వేచ్ఛ ఉందనీ, అయితే వారితో కలవడం వల్ల తమ సమయం వృథా అవుతుందనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
25న విశాఖకు కేంద్రం బృందం రాక
విశాఖపట్నం(సిరిపురం): హుద్‌హుద్ తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 25న కేంద్ర అధికారుల బృందం జిల్లాకు రానుంది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ విషయం తెలిపారు. 9మంది సభ్యులు రెండు బృందాలుగా తుపానుప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారన్నారు. బుధవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. తొలిరోజు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు, ఆస్తి నష్టాలకు సంబంధిం చిన ఫోటోల చిత్రప్రదర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బృందం పర్యటించే ప్రాంతాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.