chaganti koteswa rao
-
శతక నీతి – సుమతి: వాడు దుందుభిలా ఉన్నాడే!
‘ఏం తినాలనుకుంటున్నావో అవి తినేసెయ్.. ఏది నీకిష్టమో అది ఇప్పుడే చేసేస్కో... ఎవరెవరితో ఏవేం మాట్లాడాలనుకుంటున్నావో అది ఇవ్వాళే మాట్లాడేసుకో... ఈ రాత్రికి హాయిగా నిద్రపో... రేప్పొద్దున యుద్ధానికి రా.. ఎందుకంటే మళ్ళీ ఇంటికెళ్ళవు..’ ...పొగరు మాటలు ఇవి.. రామాయణంలో కనబడతారు.. వాలి, రావణాసురుడు. వాళ్ళిద్దరి ప్రవృత్తి ఒక్కలాగే ఉంటుంది. ప్రతిరోజూ ఎవరో ఒకరి దగ్గరకి పోవడం, నువ్వు యుద్ధానికి రావాలని రెచ్చగొడుతూ ఇలా మాట్లాడుతుంటారు. వాలి దగ్గరకు వెళ్ళి దుందుభి మాట్లాడిన మాటలివి. వాలి ‘ఎవడ్రా అది’ అని బయటకు వచ్చాడు. ఫలితం– దుందుభి చచ్చిపోయాడు. ఇలాటి వాళ్ళు ఇప్పుడూ మనకు కనిపిస్తూంటారు. వీళ్ళను లోకులు దుందుభితో పోలుస్తుంటారు. వదరి మాట్లాడడం..ఎందుకలా ? అందుకే బద్దెనగారు సుమతీ శతకంలో..‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ !’ అంటారు. రామాయణం అదే చెబుతుంది. మన పురాణాలు, నీతి శాస్త్రాలూ అవే చెబుతాయి. అలా ప్రవర్తించకు. జీవితంలో అటువంటి అలవాట్లు చేసుకోకు. రావణాసురుడు కూడా ఇలాగే .. సముద్రుడి దగ్గరకు వెళ్ళి బెదిరించాడు. యమధర్మరాజును కూడా వదిలిపెట్టలేదు. కొందరు వీరి దాష్టీకానికి భయపడి పారిపోతే మరికొందరు వీరిని ఓడిస్తుంటారు..ఒకప్పుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఇలాగే ఓడిపోయాడు. అయినా బుద్ధిరాదు. సిగ్గుండదు, మారరు. అలా అతిశయంతో ప్రవర్తించినందుకు చిట్టచివరకు ఏమయింది ... రావణుడు ఒక్కడే పోలేదు, బంధుమిత్రకళత్రాదులందరూ పోయారు, లంకాపట్టణంలో ఉన్న రాక్షసులందరూ పోయారు. .ధర్మం వైపునిలబడ్డ విభీషణుడు తప్ప. ఒకప్పుడు ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సభకు వెళ్ళినా ఒక మాట అంటుండేవాడు...నాకు తెలిసినన్ని అంకెలు, సంఖ్యలు ఎవరికీ తెలియవు. ఎంతవరకయినా లెక్కపెట్టగలను... అని. ఒకసారి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు.. ఒడ్డున ఇసుక బాగా ఉంటుంది కదా... అక్కడ కూర్చుని చేత్తో గుప్పెడు ఇసుక తీసుకొన్నాడు. ఉన్నట్లుండి.. తత్త్వం బోధపడింది. నేను నిజంగా ఇక్కడ ఉన్న ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టి చెప్పగలిగే అంకెలు, సంఖ్యలు నాకు తెలుసా.... ఎదురుగా ఉండే అలలు ఎగిసిపడుతుంటే నీటిబిందువులను చూసాడు... వీటిని లెక్కపెట్టి చెప్పగలిగే సంఖ్య నాకు తెలుసా.. ఇలా ఆలోచిస్తుంటే.. నేను ఎంత పెద్ద సంఖ్యయినా లెక్కపెట్టగలను అనుకున్నాను. కానీ కాదు. నాకు తెలిసినదేపాటి? వాటిని సృష్టించినవాడు గొప్ప... అని చేతులెత్తి నమస్కరించుకున్నాడు. ఇక ఆ పై ఎప్పడూ ఇటువంటి అతిశయోక్తి మాటలు మాట్లాడలేదు. ఇతరులకంటే మనకు ఏవయినా కొన్ని విషయాలు కానీ వాటిలో నైపుణ్యాలు కానీ ఎక్కువ తెలిసి ఉండడం తప్పుకాదు. కించిత్ గర్వ కారణం కూడా. కానీ నాకే అన్నీ తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి అని వదరడం మాత్ర తప్పు. మనం ఎంతటి గొప్పవారమయినా మనకంటే గొప్పవారు కూడా ఉంటారనే ఎరుక ఉండాలి. అప్పుడు వినయం దానంతటే అదే వస్తుంది. శంకర భగవత్పాదులవంటి మహాపురుషుడు ఒక చోట...‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథిత్ కృపయా పాలయ విభో’’ అంటారు. శంకరా, నేను పశువుతో సమానం– అల్పజ్ఞుణ్ణి. నీవు పశుపతివి.. అంటాడు. అంతటివాడు అంత వినయం ప్రదర్శిస్తే అరాకొరా తెలిసిన మనం ఎలా ప్రవర్తించాలి? -
కల్చర్ తక్కువ అఫైర్స్ ఎక్కువ!
అక్షర తూణీరం ‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు. ఉగాది పండగవేళ పలకరిద్దామని కవి మిత్రులకు ఫోన్ చేస్తే, మాకుగాదులు లేవు, మాకుషస్సులు లేవంటూ నినదించాయి. మహా సంతర్పణలోనే ఒక విస్తరి దొరక్కపోతే, ఇక విడిగా ఏం దొరుకుతుందని వాపోయారు. ముఖ్యంగా రెండు, మూడు పద్యకవులు... దోషం వ్యాకరణ దోషం- ఇద్దరు ముగ్గురు పద్యకవులు ఛందస్సుకి ఆంధ్రరాష్ట్రంలో శాలువా మాత్రం చోటు దొరక్కపోవడం శోచనీయమన్నారు. గళాలు విప్పి నిప్పులు కురిపించాం. అన్యాయం నించి కరువు దాకా అన్నిటి మీదా స్పం దించాం, ‘‘ఏదీ మాకో నూలుపోగు’’ అంటూ ఓ గుప్పెడు అభ్యుదయ కవులు ఉద్రేకంగా మాట్లాడారు. ఎప్పుడైనా ఇది మామూలే. కొన్ని సత్కారాలు కొన్ని భంగపాట్లకి చోటిస్తాయి. అసంతృప్తులు మంత్రి వర్గ విస్తరణప్పుడే కాదు, ఉగాది తరుణంలోనూ పుట్టుకొస్తారు. ఈ అసంతృప్తులు ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి కొంచెం ఊరట చెందుతారు. ‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన చాలా యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు. ‘‘... పురుషులు, స్త్రీలు, ఇతరులు అనడం అలవాటు. వాటీజ్ దిస్, ఇతరములు ఏవిటండీ? సాహిత్యం, సంగీతం, శిల్పం, తోటకూర, గోంగూర ఏదో చెప్పాలిగా. ఇతరములు అంటే ఏమిటవి? తెలుగు జాతికి తెలియాలి కదా! ’’అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మేస్టారూ! ఇవేనా కళలు? చెక్క భజన గొప్పదే. చేనేత కళ గొప్పది కాదా? బుర్రకథ గొప్పదే. కానీ తాపేశ్వరం కాజా తయారీ మరింత విశేషం కాదా చెప్పండి! నెల్లూరు కోమల విలాస్‌లో మజ్జిగ పులుసు అద్భుతం కదా! ఏది దానికి గుర్తింపు-’’ క్లాసు పీకాడొకాయన. ‘‘మీరు ఎన్ని చెప్పండి (నిజానికి నేనసలేం చెప్పలేదు), ఈ ముఖ్యమంత్రి వచ్చాడంటే కల్చర్ తక్కువగానూ, అఫైర్స్ ఎక్కువగానూ ఉంటాయండీ’’ అని ముక్తాయించాడింకో పెద్దాయన. అసలెందుకొచ్చిన గొడవ. ఇప్పుడెలాగూ మనం ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఉగాది సన్మానాలను సైతం ఘనంగా చేసుకోవచ్చు. కళాకారులకు కవులకు వ్యాపార సంస్థలతో పరిచయాలుంటాయి. కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ కంపెనీలు, సినిమా సంస్థలు మొదలైనవి. ఆయా సంస్థలు ఒకరి పేరు సూచించి, లక్ష రూపాయలు విరాళం ఇస్తుంది. ఇలా ఒక వంద పేర్లు, వంద లక్షలు సేకరిస్తాం. ఓ పది పేర్లు నిజంగానే ఎవరి ఆసరా లేని నిజం కళాకారుల్ని ఎంపిక చేస్తాం. దీనిలో వంద మీద వంద లక్షలు వసూలవుతుంది. అర లక్ష చొప్పున పురస్కారం ఉంటుంది. వాళ్ల మీద ఓ అయిదు ఖర్చవుతుంది. సభకి, శాలువలకి, దండలకి ఇంకో నాలుగైదులకారాలవుతుంది. కాగా పోగా, తరుగులు పోగా పాతిక ముప్పయ్ లక్షలైనా కల్చరల్ ఎఫైర్స్‌కి జమ పడుతుంది. పైగా ఎక్కువమందిని సంతృప్తి పరిచిన సంతృప్తి కూడా సీయమ్కి మిగు ల్తుంది. నేను ఈ విధంగా పరిపరి విధాల ఆలోచనలు చేస్తుంటే ఒకాయన లైన్లోకి వచ్చి అసలు పురస్కారాలు జరగాల్సింది కాడి మోస్తున్న లిక్కర్ షాపు యజమానులకండీ. రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా కస్టమర్లను చైతన్యపరుస్తూ... ఆయన గొంతు గద్గదమై పూడుకుపోయింది. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా చాగంటి
విజయవాడ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చాగంటిని ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చాగంటి ప్రవచనాలు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. సమాజ హితం కోసం చాగంటిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.