chain smoker
-
4 గంటల్లో 23 సార్లు ఆగిన గుండె!
ఆయన వయసు 60 ఏళ్లు. ఎంచక్కా తన ఏడేళ్ల మనవడితో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఆయనకు కేవలం 4 గంటల వ్యవధిలో 23 సార్లు గుండె ఆగింది. అయినా తట్టుకుని నిలబడ్డారు!! విపరీతంగా సిగరెట్లు కాల్చే అలవాటున్న ఆ పెద్దాయన గుండెల్లో బాగా నొప్పిగా ఉందని చెప్పినప్పుడు.. ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఈసీజీ తీయిస్తే, గుండెపోటు వచ్చినట్లు తేలింది. ఆయనకు చికిత్స చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించకపోగా.. పదేపదే చాలాసార్లు ఆయన గుండె ఆగిపోయింది. తర్వాత ఆయనను ఆస్టర్ మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. తొలిసారి గుండెపోటు వచ్చినప్పుడే పెద్ద ఆస్పత్రికి తీసుకురాకపోవడంతో.. తొలి గంటలో అందించాల్సిన చికిత్స అందలేదని.. అయినా అసలు నాలుగు గంటల్లో 23 సార్లు గుండె ఆగడం చిన్న విషయం కాదని సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. స్టెంటు వేయడం ద్వారా బ్లాకు క్లియర్ చేశామని తెలిపారు. సాధారణంగా గుండెపోటు వస్తే గుండెలో ఒక భాగానికి రక్తసరఫరా ఆగుతుందని, కానీ.. ఇక్కడ ఏకంగా గుండె కొట్టుకోవడమే ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) ఆయన వివరించారు. ఆయన ఇక జీవనగమనంలో వేగాన్ని తగ్గించుకోవాలని, ఇప్పుడు కేవలం 30 శాతం పంపింగ్తోనే గుండె పనిచేస్తోందని తెలిపారు. -
విమానంలోనూ అగ్గిపెట్టె నా వెంటే..
నిబంధనలు ఉల్లంఘించానన్న విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు న్యూఢిల్లీ: విమానాల్లో తానే భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. చైన్స్మోకర్ అయిన తాను విమానంలో ప్రయాణించేటప్పుడూ అగ్గిపెట్టెను తన వెంటే ఉంచుకుంటానని తెలిపారు. దేశంలో విమానాల్లో అగ్గిపెట్టె, లైటర్కు అనుమతిలేనప్పటికీ తన వెంటే తీసుకెళ్తానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విమానయాన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సాక్షాత్తు ఆ శాఖ మంత్రి ఇలా అన్నారు. మంగళవారమిక్కడ విమానయాన భద్రతపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రిని కాబట్టి విమానాశ్రయంలో ఎవరూ తనిఖీ చేయరని, అందువల్లే తీసుకెళ్తానని చెప్పారు. తాను మంత్రిగా లేనప్పుడు విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీచేసినప్పుడు చాలా అగ్గిపెట్టెలు, లైటర్లు పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానయాన మంత్రి అయిన తర్వాత తననెవరూ తనిఖీచేయడం లేదన్నారు. ఎల్లప్పుడూ తన జేబు లో అగ్గిపెట్టె ఉంటుందని, ఇప్పుడూ ఉందని అన్నారు. మీరు విమానంలో అగ్గిపెట్టెను ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నకు నేరుగా స్పందించకుండా.. అగ్గిపెట్టెతో ముప్పు వాటిల్లిన ప్రమాదాలున్నాయా అని తిరిగి ప్రశ్నించారు. -
చైన్ స్మోకర్గా మారిన అమీర్