ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడ
టీఎస్ఐఐసీ యాప్ ప్రారంభించిన చైర్మన్ బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు పేర్కొన్నారు. గురువారం టీఎస్ఐఐసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సహజవనరుల లభ్యతను బట్టి పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, ఫుడ్‌పార్క్, టెక్స్టైల్ పార్క్, లెదర్ పార్క్, ప్లాస్టిక్ పార్క్, ఇబ్రహీంపట్నం ఫైబర్‌గ్లాస్ పార్క్‌ల్లో ప్లాట్ల కేటారుుంపునకు సంబంధించి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై అధికారులు వివరించారు.