స్కూల్కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం
యాడికి (అనంతపురం): రోజూ స్కూల్కు వెళ్లాల్సి వస్తుందని విషపు గుళికలు మింగి ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామ శివారులో ఉన్న కొండమీద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే ఇష్లం లేని ఆ ముగ్గురూ కలిసి విషపు గుళికలను పొడిగా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగారు. వారి పరిస్థితి విషమంగా ఉండటం గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.