Chaurasia
-
కేబీఆర్ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం
-
కేబీఆర్ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం
Actress Shalu Chaurasia Attack: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో నటి చౌరసియాపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలగు పోలీసు బృందాలతో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కలా సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. వీఐపీ జోన్లోనే దారి దోపిడీ జరగడంపై నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఆదివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్‌బక్స్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పరారయ్యాడు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఆభరణాలు, సెల్‌ఫోన్ కోసమే దాడికి పాల్పడ్డాడా..లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
చౌరాసియానే చాంపియన్
గుర్గావ్: భారత గోల్ఫర్ ఎస్ఎస్పీ చౌరాసియా ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను వరుసగా రెండోసారి సాధించాడు. ఆదివారం స్థానిక డీఎల్ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్లో జరిగిన పోటీలో తను విజేతగా నిలిచాడు. చాంపియన్‌గా నిలిచినందుకు తను దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. అలాగే ఆసియా టూర్లో భాగమైన ఈ ఇండియన్ ఓపెన్‌ను వరుసగా రెండో సారి సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో జ్యోతి రణ్‌ధావా (2006, 2007) ఇలా రెండుసార్లు టైటిల్ సాధించాడు. ఓవరాల్‌గా చౌరాసియా ఈఘనత సాధించిన మూడో ఆటగాడు. కెంజీ హోసోయిషి (1967, 1968) తొలిసారిగా ఈ ఫీట్ సాధించారు. పోటీ చాలా కఠినంగా సాగినా టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని 38 ఏళ్ల చౌరాసియా తెలిపాడు. ఆసియా టూర్ టైటిల్ నెగ్గడం ఈ కోల్‌కతా గోల్ఫర్‌కు ఇది ఆరోసారి. అలాగే మరో భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి 2015లో ఈ టైటిల్ నెగ్గగా ఈసారి ఐదో స్థానంతో సరిపుచ్చుకున్నాడు.