Chennai-Bangalore
-
జెట్ స్పీడ్‌గా హైవే పనులు.. ఇక బెంగళూరుకు 135 నిమిషాలే టైమ్..
పలమనేరు : చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు స్పీడందుకున్నాయి. చెన్నై సమీపంలోని శ్రీపెరంబూదూర్ నుంచి బెంగళూరు సరిహద్దు లోని హొసకోట వరకు 283.5 కిలోమీటర్ల మేరకు 6 ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై వే అథారిటీ ఆఫ్ ఇండియా) భారత్‌మాల పరియోజన పథకం కింద రూ.16,730 కోట్లతో 2021 నుంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మూడు ఫేజుల్లో పనులు సాగుతున్నాయి. తొలిఫేజ్‌లో కర్ణాటక పరిధిలోని 71 కిలోమీటర్లలో ఇప్పటికే 37.56 శా తం పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు ఫేజ్ లలో మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 112 కిలోమీటర్లలో పదిశాతం మట్టిరోడ్డు పనులు, అలైన్మెంట్ ల్యాండ్ లెవలింగ్ సాగుతోంది. పనులు త్వరితగతిన జరిగేలా మూడు ఫేజ్‌లలో పది ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో కర్ణాటకలో మూడు, ఏపీలో మూడు, తమిళనాడులో నాలుగు ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా 60 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున్నాయి. వీటిని బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు మోంటేకార్లె లిమిటెడ్ కంపెనీ, బైరెడ్డిపల్లె నుంచి బంగారుపాళెం వరకు ఆప్కో ఇన్ఫ్రాటెక్ కంపెనీ, బంగారుపాళెం నుంచి గుడిపాల దాకా దిలీప్‌బిల్డ్‌కాన్ కంపెనీ పనులు చేపడుతున్నా యి. పలమనేరు మండలంలోని బేలుపల్లి క్రాస్, పట్టణ సమీపంలోని గంటావూరు వద్ద పనుల సామగ్రి కోసం యంత్రాలను నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసుకుంది. పలమనేరు నియోజకవర్గంలో చెన్నై– బెంగళూరు 6 ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలైన్మెంట్ మేరకు మట్టి రోడ్డు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. హైవే మూడు ఫేజ్‌లలో నిర్మాణం సాగుతుండగా.. ఇప్పటికే కర్ణాటకలో 37శాతం పనులు పూర్తయ్యాయి. రెండో ఫేజ్‌లో పలమనేరు నియోజకవర్గంలోనూ పదిశాతం పనులు జరిగాయి. ఈనెల 10న కర్ణాటక రాష్ట్రంలోని హొసకోట సమీపంలో వడగనహళ్లి వద్ద పనులను పరిశీలించిన కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌గడ్కరి 2024 మార్చికల్లా పూర్తిచేసి ప్రారంభించనున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. దక్షిణాదిలోనే తొలి ఎక్స్‌ప్రెస్ హైవే దక్షిణ భారతదేశంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే మొట్టమొటది కానుంది. దీనికి ఎన్హెచ్ఏఐ ఎన్ఈ 7గా నామకరణం చేశారు. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధి పెంపొందించడమే ఈ రహదారి నిర్మాణ ఉద్దేశం. బెంగళూరు నుంచి చెన్నై పోర్టుకు రవాణా సౌకర్యాలు పెరిగేందుకు ఈ రోడ్డు ఉపకరిస్తుంది. బెంగళూరు నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించేవారు సైతం తక్కువ. ఈ హైవే పూర్తయితే దాదాపు అంతే సమయానికి విమాన చార్జీలకంటే తక్కువ ధరతో రోడ్డు మార్గంలోనే ప్రయాణించే సౌకర్యం కలుగుతుంది. ఎక్స్‌ప్రెస్‌హైవే వివరాలిలా... - చెన్నై నుంచి బెంగళూరు వరకు రోడ్డు దూరం 283.5 కిలోమీటర్లు - ఇది కర్ణాటకలో 77 కి.మీ, ఏపీలో 91 కి.మీ, తమిళనాడులో 93 కిలోమీటర్లు - ఇప్పటి వరకు బెంగళూరు–చెన్నై ప్రయాణ సమయం 6 గంటలు - ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల 15 నిమిషాలు మాత్రమే - ఈ రహదారిలో సాధారణ వేగం గంటకు 120 కిమీ - ఎక్స్ప్రెస్హైవేలో మొత్తం బ్రిడ్జిలు –162 - రైల్వే క్రాసింగ్‌లు–4, కల్వర్టులు–143 - మొత్తం ఫ్లైఓవర్లు– 17 ఉంటాయి. -
మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. మహర్దశ!
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య ప్రాంతానికి మహర్దశ పట్టడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య నిమ్జ్(నేషనల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్) ఏర్పాటుకు బడ్జెట్లో కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూ.31 వేల కోట్ల పెట్టుబడులను నిమ్జ్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) భారత్ విభాగం డెరైక్టర్ హున్ కిమ్ ఈనెల 7న సీఎం చంద్రబాబుకు స్పష్టీకరించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో మన జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది. కృష్ణపట్నం నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. రాజ దాని ఎంపికపై డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ జూలై 9న తిరుపతిలో పర్యటించి.. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి పారిశ్రామికాభివృద్ధి ఒక్కటే శరణ్యమని స్పష్టీకరించింది. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదించింది. డాక్టర్ శివరామకృష్ణన్ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం శ్రీకాళహస్తి-ఏర్పేడు మధ్య ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుకు 201 4-15 బడ్జెట్లో నిధులను సైతం కేటాయించింది. నిమ్జ్ ఏర్పాటుకు ఏడీబీ అధికారులు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రణాళిక రచించాయి. ఈ మేరకు ఈనెల 7న సీఎం చంద్రబాబుతో ఏడీబీ భారత్ విభాగం డెరైక్టర్ హున్ కిమ్ సమావేశమయ్యారు. యూరోపియన్ యూనియర్, అమెరికా, చైనా సంస్థలతో చర్చించి రూ.31 వేల కోట్లతో శ్రీకాళహస్తి-ఏర్పేడు నిమ్జ్‌లో పరిశ్రమలను స్థాపించేందుకు ప్రయత్నిస్తామని హున్ కిమ్ ప్రతిపాదించారు. కానీ.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టేందుకు బహుళ జాతి సంస్థలు ముందుకొస్తాయని స్పష్టీకరించారు. శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గమే ప్రధానం శ్రీకాళహస్తి-ఏర్పేడు మధ్య ప్రాంతాన్ని కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానం చేసేలా శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఏడీబీ అధికారుల బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకూ 308 కిమీల మేర రైలు మార్గం నిర్మాణానికి రూ.1,500 కోట్లతో రైల్వేశాఖ ఇప్పటికే ప్రణాళిక రచించింది. ఈ రైలుమార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో పూర్తిచేయడానికి 2012-13 బడ్జెట్లో అంగీకరించాయి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులను కేటాయించకపోవడం వల్ల ఆ రైలు మార్గం నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. అత్యంత ప్రధానమైన ఈ రైలుమార్గానికి ఇప్పటిదాకా రూ.1.76 కోట్లే ఖర్చు చేశారు. 2013-14 బడ్జెట్లో రూ.కోటి, 2014-15 బడ్జెట్లో రూ.ఐదు కోట్లను కేటాయించినా.. ఆ మేరకు కూడా నిధులను ఖర్చుచేయకపోవడం గమనార్హం. ఈ రైలుమార్గాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. చెన్నై-బెంగళూరు, తడ-పూతలపట్టు రహదారులను నాలుగు వరుసల రోడ్లుగా అభివృద్ధి చేయాలని ఏడీబీ అధికారుల బృందం ప్రతిపాదించింది. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ఆవశ్యకమైన జలాలు శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతంలో అందుబాటులో లేవు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తే నిమ్జ్‌కు నీటి అవసరాలను తీర్చవచ్చు. శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాం తానికి సమీపంలోనే ఉన్న రేణిగుంట విమానాశ్రయా న్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని ఏడీబీ అధికారుల బృందం ప్రతిపాదించింది. మౌలిక సదుపాయాలపై కసరత్తు ఏదీ? శ్రీకాళహస్తి-ఏర్పేడు నిమ్జ్‌కు మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గానికి 2014-15 బడ్జెట్లో కేవలం రూ.ఐదు కోట్లను కేటాయించడమే అందుకు తార్కాణం. ఇక ఈ రైలు మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులుగా ఒక్క పైసాను కూడా కేటాయించకపోవడం గమనార్హం. పూతలపట్టు-తడ, చెన్నై-బెంగ ళూరు రోడ్లను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేసే పనులు సైతం నత్తనడక సాగుతున్నాయి. రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయాలంటే కనీసం రూ.1200 కోట్లు అవసరమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అంచనా వేశారు. కానీ.. ఆ విమానాశ్రయానికి రూ.150 కోట్లతో అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు మాత్రమే 2010లో కేంద్రం అంగీకరించింది. పోనీ.. ఆ పనులైనా వేగంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. అటవీశాఖ అనుమతులు లభించకపోవడం వల్ల సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. -
కర్ణాటక సరిహద్దులో విషాదం
కేఎస్ ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీ 14 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం కోలారు, బెంగళూరు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు పలమనేరు: పలమనేరు సమీపంలోని కర్ణాటక సరిహద్దులో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ముల్బాగల్ సమీపంలోని కప్పలమడుగు, శ్రీరంగపురం గ్రామాల సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై కేఎస్ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తు పట్టలేని విధంగా మారాయి. మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం దద్దరిల్లింది. మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు.. మృతుల్లో కోలారు జిల్లా గద్దేకల్లూరుకు చెందిన నా గేష్, బెంగళూరు కోడిహళ్లికి చెందిన నాగమణి, బెంగళూరు సిటీకి చెందిన నారాయణమ్మ, తుమ్కూరుకు చెందిన బస్సుడ్రైవర్ గంగాధరయ్య, ముల్బాగల్కు చెందిన విజయమ్మ, బెంగళూరుకు చెందిన భారతి బ్రహ్మచారి, కర్ణాటకకు చెందిన నితీష్‌కుమార్(2), ఆంధ్రాకు చెందిన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లె మండలం చిక్కనపల్లెకు చెందిన రాజశేఖర్, పలమనేరు పట్టణానికి చెందిన లిఖిత్‌కుమార్ (3), శాంతాభాయి(55), తిరుపతికి చెందిన పార్వతమ్మ ఉన్నారు. మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. పలు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు.. ఈ ప్రమాదంలో గాయపడిన 13 మందిని ముల్బాగల్, కోలార్, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో బెంగళూరుకు చెందిన సోమశేఖర్, తుంకూరుకు చెందిన కేఎస్ఆర్టీసీ కండక్టర్ నరసింహరాజు, గౌరీబీదునూర్కు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యమాచారి, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం.. బెంగళూరు వైపు వేగంగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు వాహనాలు వేగంగా ఢీకొనడంతోనే ఇంత ఘోరం జరిగిందని తెలుస్తోంది. సింగిల్ రోడ్డుపై వస్తున్న బస్సు కుడివైపు పూర్తిగా దూసుకుపోయేలా లారీ ఢీకొంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు.. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే డె ప్యూటీ కమిషనర్ రవి, కోలారు జిల్లా ఎస్పీ అజయ్ విలోరి, డీఎస్పీ సిద్ధ్దేశ్వర్, సీఐ కృష్ణప్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్ప, నంగిలి ఎస్ఐ అంబరేష్ గౌడ, ముల్బాగల్ ఎమ్మెల్యే మంజునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, పీడబ్ల్యూడీ విభాగానికి చెందిన పలువురు అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మృతుల కుటుంబాలకు కేఎస్ఆర్టీసీ రూ.2.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.