బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
గజపతినగరం: జిల్లాకు చెందిన 24 మంది కూలీల మృతికి కారణమైన చెన్నై భవన యజమానిపై న్యాయ పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా, మరింత పరిహారం అందేలా కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితుల తరఫున చెన్నై హైకోర్టులో పోరాడేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమి స్తున్నట్టు తెలిపారు.
చెన్నైలోని 12 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురంలో కూలీల కుటుంబీకులకు బుధవారం వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. మృతులు పతివాడ బంగారునాయుడు, సిరిపురపు రాము, కర్రితౌడమ్మ, పేకేటి అప్పలరాము, పేకేటిలక్ష్మి(భార్యాభర్తలు), వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన మంత్రి మీనమ్మకు పార్టీ తరఫున చెక్కులు పంపి ణీ చేశారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికిరూ.75 వేలు చొప్పున, గాయపడిన మీనమ్మకు రూ.20 వేలు సాయం అందజేశారు.
ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ చెన్నై ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు ఆదుకోలేదని విమర్శించారు. జిల్లాలో ఉపాధి హా మీ పథకం సక్రమంగా అమలు కాకపోవడంతో కూలీ పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వె ళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నా యన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉపాధి హామీ పథకంలో లోపాలపై ప్రశ్నించనున్నట్టు తెలిపారు. సాలూరు ఎమ్మెల్యే పీడక రాజన్నదొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గం పరిధిలో తూరుమామిడి, గైశీల గ్రామాల్లో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డా వారిని పట్టించుకోలేదన్నారు. గైశీల గ్రామానికి చెందిన సుశీల తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌కు వెళితే రెండు రోజుల పాటు నామమాత్రంగా వైద్య పరీక్షలు జరిపి ఇంటికి పం పించివేశారని ఆరోపించారు.
ప్రస్తుతం ఆమె వికలాంగురాలై మంచం దిగలేని పరిస్థితిలో ఉందన్నారు. సుశీలకు విక లాంగ పింఛన్ కింద రూ.1500 తక్షణమే అందజేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దృష్టి కి తీసుకు వెళ్లనున్నట్టు తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకొస్తే, శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తున్నట్టు చెప్పారు. బాధితులు అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని చె ప్పారు. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు బాధితుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం మిగతా నాయకులు చెక్కులు పంపిణీ చేశారు.
గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జ్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే చత్రుచర్లచంద్రశేఖర్ రాజు, పార్వతీపురం, ఎస్‌కోట నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, మాజీ ఎంపీపీ వర్రి నర్సింహమూర్తి,పార్టీనాయకులు పరీక్షీత రాజ్, ఎస్. బంగారునాయుడు, బమ్మిడి అప్పలనాయుడు, గంటా తిరుపతిరావు, రెడ్డి గురుమూర్తి, ఎం.శ్రీనివాసరావు, బోడసింగిసత్తిబాబు,వింద్యవాసి, ఎం. లింగాలవలస సర్పంచ్‌లు కోలావెంకటసత్తిబాబు, పప్పలసింహచలం, కోడి బాబుజి, దనానరాంమూర్తి, మృత్యంజయరావు,రౌతు సరిసింగరావు. తదితరులు పాల్గొన్నారు.