చెన్నై ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి: జగన్ | Take action and demand justice for victims of chennai building collapse, says YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

చెన్నై ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి: జగన్

Published Wed, Aug 20 2014 9:53 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

చెన్నై ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి: జగన్ - Sakshi

చెన్నై ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి: జగన్

హైదరాబాద్: చెన్నైలో ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... భవనం కూలిన ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వైఎస్ జగన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ఆ భవన నిర్మాణ కార్మికుల మృతుల్లో అత్యధికులు ఉత్తరాంధ్రకు చెందిన వారే. దాంతో ఉత్తరాంధ్రలోని మృతుల కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించి... ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. చెన్నైలో జూన్ చివరి వారంలో 11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 54 మందికిపైగా మరణించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement