Chennai-Vizag Industrial Corridor
-
విభజన హామీలు అమలయ్యేదెన్నడు?
* ఆరు నెలల నుంచీ కేంద్రం పరిశీలనలోనే 25 అంశాలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి సోమవారంతో ఆరు నెలలు కావస్తోంది. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చిన హామీల్లో కేవలం రెండింటిలోనే కదలిక రాగా.. మిగతా 25 అంశాలూ ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వ ‘పరిశీలనలో’నే ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీల్లో.. ఒక్కటి కూడా ఈ ఆరు నెలల్లో నెరవేరలేదు. అలాగే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో కూడా ఇప్పటి వరకు రెండు హామీలను మాత్రమే కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో ఎయిమ్స్‌కు మాత్రం అనుమతిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు నివేదిక రూపకల్పనకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకును ఏజెన్సీగా నియమించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రకటించారు. కానీ.. ఈ అంశంపై ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎటువంటి ఆశాజనకమైన ప్రకటనా వెలువడలేదు. -
పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు బాధ్యత ఏడీబీదే
హైదరాబాద్: చెన్నై-వైజాగ్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు బాధ్యత ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)కి అప్పగిస్తూ భారత ప్రభుత్వంలోని పరిశ్రమల విభాగం నిర్ణయం తీసుకుంది. దీంతో వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ కారిడార్ ఏర్పాటుకు అవసరమైన నిధుల్ని ఏడీబీయే సమకూర్చనుంది. ఈ మేరకు ఏడీబీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో భేటీ అయ్యారు. ప్రాథమికంగా కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబుకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు 10న మరోసారి ఏడీబీ బృందం సీఎంతో భేటీ కానుంది. అప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నివేదికను సిద్ధం చేసేలా నిర్ణయించారు.