Chennaiyin
-
చెన్నైయిన్ ఎఫ్‌సీ శుభారంభం
ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా భువనేశ్వర్‌లో ఒడిశా ఎఫ్‌సీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. చెన్నైయిన్ తరఫున ఫారుఖ్ (48వ, 51వ ని.లో) రెండు గోల్స్... డేనియల్ (69వ ని.లో) ఒక గోల్ చేశారు. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 1–0 గోల్‌తో ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టును ఓడించింది. -
చెన్నైయిన్పై గోవా విజయం
ఫటోర్డా: పారుుంట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నైయిన్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య జరిగిన ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. గురువారం జరిగిన ఈ హోరాహోరీ పోరులో చివరికి 5-4 తేడాతో గోవా నెగ్గింది. ఐఎస్ఎల్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 9 గోల్స్ నమోదవడం ఇదే తొలిసారి. గోవా తరఫున లూయిజ్ (6, 76వ నిమిషాల్లో), టవోరా (68, 90)రెండేసి గోల్స్ సాధించగా గోంజాలెజ్ (21) మరో గోల్ చేశాడు. చెన్నైరుున్కు రింజువాలా (4), అర్నోనిల్ (గోవా ఆటగాడి సొంత గోల్ 14), ఒమగ్బెమి (28), రీజ్ (88) గోల్స్ చేశారు. ఈ రెండు జట్లకిదే చివరి లీగ్ మ్యాచ్ కాగా ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించారుు. -
చెన్నై, కోల్‌కతా మ్యాచ్ డ్రా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రా అయింది. అట్లెటికో తరఫున హెల్డెర్ పోస్టిగా (39వ ని.) గోల్ చేయగా, చెన్నైయిన్‌కు డేవిడ్ సుకి (77వ ని.) గోల్ సాధించి పెట్టాడు. తాజా ఫలితంతో కోల్‌కతా 15 పారుుంట్లతో మూడో స్థానంలో... చెన్నైరుున్ 14 పారుుంట్లతో ఆరో స్థానంలో నిలిచారుు. -
చెన్నైయిన్, కోల్‌కతా మ్యాచ్ డ్రా
కోల్‌కతా: చివరి నిమిషాల్లో చేసిన గోల్‌తో అట్లెడికో డి కోల్‌కతా ఓటమి నుంచి తప్పించుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నైరుున్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు 2-2తో డ్రాగా ముగించింది. దాదాపుగా మ్యాచ్ ఆద్యంతం చెన్నైరుున్ ఆధిక్యం చూపినా చివరి నాలుగు నిమిషాల్లో తడబడింది. డౌటీ (59వ నిమిషంలో), హ్యుమే (86) అట్లెటికో తరఫున గోల్స్ చేయగా.. చెన్నైరుున్ నుంచి జయేశ్ (66వ నిమిషంలో), ముల్డర్ (70) గోల్స్ సాధించారు.