cheruvukindapalli
-
‘మూతబడి’కి టీచర్ నియామకం
- సాక్షి ఎఫెక్ట్ చిలమత్తూరు: మండలంలోని సోమఘట్ట పంచాయతీ చెరువుకిందపల్లి పాఠశాలకు చెరువుముందరపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతిని నెలరోజుల పాటు డిప్యూటేషన్‌పై పంపినట్లు ఎంఈఓ సురేష్‌బాబు తెలిపారు. శనివారం ‘మూత బడి’ అనే శీర్షికన చెరువుకిందపల్లి పాఠశాలలో టీచర్ లేరంటూ ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. రెగ్యులర్ టీచర్‌ను నియమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
మూత‘బడి’
ఇది సోమఘట్ట పంచాయతీ చెరువుకిందపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో మూడు రోజులుగా పాఠశాల మూతపడింది. ఏడాది కాలంగా మండలంలోని శెట్టిపల్లి పంచాయతీ పెద్దన్నపల్లి పాఠశాల నుంచి ఉపాధ్యాయుడు హనుమంతు డిప్యూటేషన్‌పై వచ్చి పని చేశారు. ఇటీవల ఆయన డిప్యూటేషన్ రద్దు కావడంతో తిరిగి యథాస్థానానికి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఎవరినీ నియమించకపోవడంతో పాఠశాల మూతపడింది. ఈ నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్ ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. - చిలమత్తూరు: