రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ప్రారంభం
ఉండి : రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ఆదివారం మండలంలోని చినపుల్లేరు శివారు తల్లమ్మచెరువులో ప్రారంభమయ్యాయి. గ్రామంలోని లూథరన్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎస్సై మంతెన రవివర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఇటువంటి క్రీడలు ఆడుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కలిదిండి రామకృష్ణంరాజు, పెన్మత్స రామరాజు, సర్పంచ్ కాపా లేయమ్మ రెడ్డియ్య, పెదపుల్లేరు సర్పంచ్ గేదెల మేమలత నరసింహం, ఎంపీటీసీ ఎన్.నిర్మలా సుధాకర్, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో తల్లమ్మచెరువు ఎ జట్టు జక్కరం జట్టుపై, తల్లమ్మచెరువు బి జట్టుపై చెరుకువాడ, కుముదవల్లి జట్టుపై ఉండి పెదపేట, వెలివర్రు జట్టుపై చెరుకువాడ బి జట్టు, కొడవల్లి బి జట్టుపై కోపల్లె జట్టు విజయం సాధించాయి.