Chinese Phones
-
దేశంలో చైనా ఫోన్లను ‘బ్యాన్’ చేయం: కేంద్రం!
గత కొద్ది రోజులుగా చైనా స్మార్ట్ఫోన్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయనుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకోనుందని నివేదికలు హైలెట్ చేశాయి. చైనాకు చెందిన షావోమీ, రియల్మీ, వివో, ఒప్పోకు చెందిన రూ.12వేల లోపు బడ్జెట్ ఫోన్లను బ్యాన్ చేయనుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్లను బ్యాన్ చేస్తున్నారా? లేదా? అనే అంశంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. బడ్జెట్ ఫోన్లను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేయాలని చైనా ఫోన్ల తయారీ సంస్థల్ని కోరామని అన్నారు. అంతే తప్పా దేశంలో చైనా ఫోన్లను బ్యాన్ చేయాలనే ప్రతిపాదనలేదని తేల్చి చెప్పారు. దేశీయంగా ఉత్పత్తుల్ని పెంచడమే ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే సహించం. సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. -
చైనా ఫోన్లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ
దేశంలో చైనా స్మార్ట్ ఫోన్ లు కనిపిస్తే చాలు విసిరికొట్టండి. వాటిని వినియోగించడానికి వీల్లేదంటూ ఓ దేశానికి చెందిన రక్షణ శాఖ ఆ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. చైనా ఫోన్లతో పాటు షావోమీ, హువావే ఫోన్ల వినియోగం నిలిపివేయాలని స్పష్టం చేసింది. అందుకు కారణం ఏదైనా..ఆదేశ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని పలు దేశాలు చైనా చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ సైతం చైనా ప్రాడక్ట్‌లకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌లపై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్‌తో పాటు యూరప్ దేశాలకు చెందిన లుథువేనియా సైతం చైనాపై ఎదురు దాడికి దిగుతున్నాయి. చైనా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లలో సెన్సార్ షిప్ ఉందంటూ లుథువేనియా రక్షణశాఖ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ సెన్సార్ షిప్ వల్ల చైనా స్మార్ట్ ఫోన్లలో దేశానికి చెందిన 449 పదాలు అవుతున్నాయని ఆరోపించింది.ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్, డెమొక్రసీ మూవ్మెంట్ పదాల్ని బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ఫోన్లతో పాటు షియోమీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్లోనూ ఈ సెన్సార్షిప్ ఉందని ఆదేశ రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ దేశాదినేతలు చైనాతో పాటు పలు స్మార్ట్ ఫోన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్ షిప్ ఉన్న స్మార్ట్ ఫోన్ లను విసిరి పడేయండి' అని లిథుయేనియా రక్షణ శాఖ సహాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియస్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే లిథుయేనియా ఆరోపణలపై షియోమీ సంస్థ ఖండించింది.తమ ఫోన్లలో అలాంటి సెన్సార్షిప్ లేదని స్పష్టం చేసింది. చదవండి: తస్మాత్ జాగ్రత్త..ఈ స్మార్ట్ ఫోన్లు వారిని కనిపెట్టేస్తాయ్ -
స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు
చైనీస్ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ ఫోనే తీసుకెళ్లి, చైనా చేతుల్లో పెట్టే అవకాశాలున్నాయట. డేటా లీకేజీ, దొంగతనంపై తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో 21 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. మొబైల్ ఫోన్ల భద్రత కోసం, కంపెనీలు తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలేమిటో తమకు తెలియజేయాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన కంపెనీల్లో ఎక్కువగా చైనీస్ సంస్థలే ఉన్నాయి. కంపెనీలు అందిస్తున్న భద్రతా భరోసాలో డివైజ్, దాని ఆపరేటింగ్ సిస్టమ్, డివైజ్ బ్రౌజర్, ప్రీ-లోడెడ్ యాప్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్‌ఫోన్ భద్రతా, రక్షణ ఎంతో అవసరమని, విలువైన సమాచారాన్ని యూజర్లు దీనిలో కలిగి ఉంటారని ఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి వ్యక్తిగత డేటా వరకు ప్రతిదానికి మొబైల్‌ను వాడుతున్నారన్నారు. ఒకవేళ అవసరమైన తనిఖీలో, ఆడిట్లో డివైజ్‌లు కనుక పట్టుబడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. థర్డ్ పార్టీకి డేటా లీకయ్యే విషయంలో తాము అసలు తలొగ్గేది లేదని తెలిపారు. ప్రస్తుతం డేటా పాత్ర చాలా కీలకమని, దాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ఉందని అధికారి పేర్కొన్నారు. ఐటీ యాక్ట్, సెక్షన్ 43(ఏ) కింద యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచే బాధ్యత కంపెనీలదేనని కూడా తెలిపారు. నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా కాంటాక్ట్ జాబితాలు, టెక్ట్స్ మెసేజ్‌లు లీకవుతున్నట్టు కేసులు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఈ సమస్య రిమోట్ సర్వర్లలో ఉందన్నారు. భారత్‌లో చాలా చైనీస్ కంపెనీలు స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయని, కానీ వారందరికీ భారత్‌లో సర్వర్లు లేనట్టు తెలిపారు. మరోవైపు డొక్లామ్ వివాద పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.