గత కొద్ది రోజులుగా చైనా స్మార్ట్‌ఫోన్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయనుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకోనుందని నివేదికలు హైలెట్ చేశాయి.
చైనాకు చెందిన షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పోకు చెందిన రూ.12వేల లోపు బడ్జెట్ ఫోన్‌లను బ్యాన్ చేయనుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్‌లను బ్యాన్ చేస్తున్నారా? లేదా? అనే అంశంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. బడ్జెట్ ఫోన్‌లను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేయాలని చైనా ఫోన్‌ల తయారీ సంస్థల్ని కోరామని అన్నారు. అంతే తప్పా దేశంలో చైనా ఫోన్లను బ్యాన్ చేయాలనే ప్రతిపాదనలేదని తేల్చి చెప్పారు.
దేశీయంగా ఉత్పత్తుల్ని పెంచడమే ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే సహించం. సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment