breaking news
cinajiyar Swami
-
వెండితెరకు చిలుకూరు బాలాజీ చరిత్ర
‘‘ప్రతి ఊరిలో ఉండే దేవాలయంతో ప్రజలు అనుసంధానమై ఉంటారు. దేవుడు సర్వాంతర్యామి. ఆయనకు ప్రాంతాలు అంటూ ఏమీ ఉండవు. ఆలయ విధి, విధానాలను రెగ్యులరైజ్ చేసిన రామానుజాచార్యులు జీవితం నుంచి వెడలిన వెయ్యో సంవత్సరమిది. ఇటువంటి దివ్య ఏడాదిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పురాణంపై సినిమా తెరకెక్కించడం అభినందనీయం’’ అని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. సాయికుమార్, సుమన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం ముఖ్య పాత్రల్లో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చిలుకూరు బాలాజీ’. ఈ చిత్రం పాటల సీడీని చినజీయర్ స్వామి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ- ‘‘చిలుకూరు బాలాజీపై తెరకెక్కించిన ఈ చిత్రం పాటలను శంషాబాద్ పవిత్ర స్థలమైన శ్రీరామనగర్లోని జీవా ప్రాంగణంలో విడుదల చేయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘నేటి యువతలో భక్తిభావాలు మెండుగా ఉన్నాయి. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. దర్శకుడు సానా యాదిరెడ్డి, సంగీత దర్శకుడు అర్జున్, పాటల రచయిత కాపర్తి వీరేంద్ర, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి.రంగరాజన్ పాల్గొన్నారు. -
జీవానాభ్యుదయం
♦ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం ♦ రామనగరంలో కొనసాగుతున్న ‘జీవా గురుకులం’.. ♦ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2009లో ప్రారంభం.. ♦ కుల, మతాలకు అతీతంగా వేదపఠనం ‘విద్య లేని వాడు వింత పశువు’ అనేది నానుడి.. నేటి ఆధునిక సమాజంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా కొన్ని సందర్భాల్లో పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటప్పుడు విద్యతో మనిషి తెలుసుకున్న జ్ఞానమేమిటో బోధపడదు.. చుట్టూ ఉన్న సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియజేసే పాఠ్యాంశాలు ఉన్నప్పటికీ.. అవి కేవలం చదువుకోవడానికి పరిమితమయ్యాయి. ఇలాంటి విద్యకు భిన్నంగా.. చదువు, సంస్కారంతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ‘జీవా గురుకులం’ వేదికగా మారింది. మండలంలోని ‘జీవా’ ప్రాంగణంలో జీయర్ ఎడ్యుకే షన్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ‘వేద పాఠశాల’ ప్రత్యేకతపై ‘సాక్షి’ అందిస్తోన్న కథనం.. శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్ సమీపంలో గల శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో 2009లో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ‘జీవా గురుకులం’ ప్రారంభమైంది. ఈ వేద పాఠశాల చైర్మన్గా మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్రావు వ్యవహరిస్తున్నారు. మొదట్లో 50 మంది విద్యార్థులతో ఆరంభించిన ఈ వేద పాఠశాలలో ప్రస్తుతం 186 మంది వేద విద్యను అభ్యసిస్తున్నారు. విలువలతో కూడిన విద్యాబోధనే ఈ గురుకులం ప్రత్యేకత. ఇక్కడ వేద విద్యతో పాటు నిత్య జీవితంలో అనుసరించాల్సిన మార్గాలను బోధిస్తున్నారు. విద్యార్థులు ఆంగ్లం, సంస్కృత భాషల్లో తర్ఫీదునిస్తున్నారు. 10 ఏళ్ల వ్యవధి కోర్సుతో విద్యార్థులకు వివిధ అంశాల్లో ప్రావీణ్యం పొందేలా శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్, డిజిటల్ తరగతులతో విద్యార్థులకు బోధన చేపట్టారు. విద్యార్థులకు ఇక్కడ ఉచిత భోజన, వసతి కల్పిస్తున్నారు. అన్ని వర్గాల వారికి అవకాశం.. గురుకులంలో ప్రవేశానికి కుల, మతాలకు అతీతంగా అవకాశం కల్పిస్తున్నారు. 8 నుంచి 12 ఏళ్ల వయస్సు ఉన్న వారిని రాత, మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రవేశ రుసుంగా రూ.5 వేలు రీ ఫండ్ డిపాజిట్ తీసుకుంటారు. చెల్లించే స్తోమత లేని వారికి మినహాయింపు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడి శా, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచే కాకుండా నేపాల్ దేశానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. క్రీడల్లో రాణిస్తూ.. గురుకులం విద్యార్థులకు యోగా, కరాటే , ఎన్సీసీ, వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చెందిన పది మంది సభ్యుల బృందం ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి వచ్చి విద్యార్థులకు ఆయా అంశాల్లోతర్ఫీదునిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో యాదవ్ బుడోకాన్ కరాటేక్లబ్ నిర్వహించిన వైబీకేసీఐ ఇంటర్ డోజో చాంపియన్ షిప్ పోటీల్లో జీవా గురుకులం విద్యార్థులు 10 బంగారు, 17 వెండి, 12 కాంస్య పతకాలు సాధిం చారు. దీంతో పాటు సుమన్ బుడోకాన్ ఇంటర్నేషనల్ కరాటే అకాడమీ, 18వ జాతీయ కరాటే, కుంగ్ఫూ చాంపియన్ పోటీల్లో ఒక బంగారు పతకం, 3 వెండి, 7 కాంస్య పతకాలు పొందారు. దినచర్య ఇలా మొదలు.. గురుకులంలో విద్యార్థుల దిన చర్య తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలవుతుంది. నిద్రలేచిన తర్వాత గంట పాటు యోగా, ఉదయం 6.30 గంటలకు స్వానుష్టానం, సంధ్యావందనం చేస్తారు. 8 గంటలకు ప్రార్థన, అల్పాహారం, 8.30 నుంచి తరగతులకు హాజరవుతారు. 11.30కు భోజనం, మధ్యాహ్న ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత సేవా కార్యక్రమాలు, రాత్రి 8.30కు ప్రార్థన, అనంతరం భోజనం, చదువుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అభిరుచి మేరకు.. గురుకులంలో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు ఫౌండేషన్, ప్రిలిమినరీ కోర్సులు నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో వారికి విలువలు, కట్టుబాట్లు, అలవాట్లను నేర్పిస్తారు. విద్యార్థులు ఇక్కడి వాతావరణం, బోధన తీరుకు అలవాటు పడితేనే పైతరగతులకు పంపుతారు. రెండేళ్ల తర్వాత విద్యార్థులకు ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇస్తారు. వేద అధ్యయనంతో పాటు అకాడమిక్ చదువులో బోధన చేపడతారు. విద్యార్థుల పరిజ్ఞానం ఆధారంగా ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అదర్వణవేదంతో పాటు సంస్కృతం, సాహిత్యం, వేదాంతం, దివ్య ప్రబంధం అంశాలతో పాటు అకాడమిక్ తరగతులను నిర్విహ స్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇక్కడి నుంచే దూరవిద్యాతో ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. 2012-13 నుంచి ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. జ్ఞానం ఆచరణాత్మకంగా ఉండాలి.. మనిషి సంపాదించే జ్ఞానం ఆచరణాత్మకంగా ఉండాలి. తద్వారా సమాజానికి ఉపయోగకరంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే గురుకులం ఆశ యం. దేశానికి మంచి పౌరులను అందించడంమే ముఖ్య ఉదే ్దశం. - నీలం, వేద పాఠశాల ఇన్చార్జ్ శాస్త్ర అధ్యయానికి వేదిక.. కుల, మతాలకు అతీతంగా శాస్త్ర అధ్యయనం చేయడానికి వేద గురుకులం చక్కనివేదిక. ఇక్కడ విద్యార్థులు ఎంత జ్ఞానాన్ని ఆర్జించినా తక్కువే అవుతుంది.గురుకులం నుంచి వెళ్లిన తర్వాత వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. - గోవర్ధనాచార్యులు, వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సామవేదం నేర్చుకుంటున్నాను.. నేను ఇక్కడ 2010లో చేరాను. నేపాల్లోని ఖాట్మాండులో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఇందులో చేరాక తెలుగు, హిందీ, సంస్కృతం నేర్చుకున్నాను. ఇక్కడ అభ్యాసం పూర్తయిన తర్వాత నేను కూడా పురోహితం చేస్తాను. - ఖగేంద్ర, వేద పాఠశాల విద్యార్థి, నేపాల్ వాసి డిగ్రీ చదువుకుంటున్నాను.. వేద పాఠశాలలో నాలాయిరా దివ్య ప్రబంధం (తమిళం)తో పాటు దూర విద్యా విధానంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చదువుతున్నా. 8వ తరగతి వరకు చదవి మానేసిన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చదువును కొనసాగిస్తున్నాను. - అభిషేక్ ఆచారి, వేద పాఠశాల విద్యార్థి, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వాసి