విమ్స్‌లో మళ్లీ పందుల సంచారం
బళ్లారి (తోరణగల్లు):ముచ్చటగా మూడు రోజులు పూర్తికాకుండానే విమ్స్‌లో మళ్లీ పందులు ప్రత్యక్షమయ్యా యి. ఆస్పత్రి ఆవరణలో సంచరిస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నాయి. శుక్రవారం సిటీ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు ఆధ్వర్యంలో విమ్స్‌లో సంచరిస్తున్న పందుల్ని పట్టి వాహనాల్లో దూరప్రాంతానికి తరలించారు. దీంతో రోగులు, వారి సహాయకులు, సిబ్బం ది బెడద తీరిందని సంతోషించారు. వారి సంతోషం మూడు రోజులకే పరిమితమైంది. మంగళవారం విమ్స్ లో మళ్లీ పందుల సంచారం కనిపించింది. ఆస్పత్రి ఆవరణ అంతా ఇవి బురద గుంటలా మార్చేస్తున్నాయి. దీం తో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.