City Development Plan
-
రియల్ వరల్డ్‌లోకి ఫేస్బుక్! భారీ ఖర్చుతో..
Facebook City వర్చువల్ వరల్డ్‌లో 2.9 బిలియన్ల యూజర్లతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది ఫేస్బుక్. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్ రియాలిటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతోంది. సిలికాన్ వ్యాలీలోని తమ హెడ్ క్వార్టర్స్‌కు దగ్గర్లో ‘రియల్‌లైఫ్’ కమ్యూనిటీ కోసం ఒక పెద్ద నగరాన్ని నిర్మించబోతోంది. సుమారు 1700 అపార్ట్మెంట్లతో ‘విల్లో సిటీ’ పేరుతో డెవలప్ చేయబోతోంది. కాలిఫోర్నియా: ప్రస్తుతం మెన్లో పార్క్‌లో ఫేస్బుక్ హెడ్‌క్వార్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్థలంలోనే ఫేస్‌బుక్‌కు మరికొన్ని సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఇక కొత్తగా 59 ఎకరాల స్థలంలో విల్లో సిటీని డెవలప్ చేయబోతోంది. 1,729 అపార్ట్మెంట్లతో పాటు 193 గదులతో ఓ పెద్ద హోటల్, సూపర్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, కొత్త ఆఫీస్‌లను కట్టించనుంది. సిగ్నేచర్ డెవలప్మెంట్ గ్రూప్‌తో కలిసి ఫేస్బుక్ ఈ సిటీని నిర్మించబోతోంది. ఎంప్లాయిస్‌కు వసతి? నివాస యోగ్యంగా 320 అపార్ట్మెంట్లు, సీనియర్ల కోసం మరో 120 కేటాయించే అవకాశం ఉంది. వీటితో పాటు ఒక ఫార్మసీ, కేఫ్, న్యూయార్క్ సిటీ టౌన్ స్క్వేర్ తరహా నిర్మాణం.. ఓ భారీ పార్క్ నిర్మించనుంది. ఇక ఉద్యోగులు కావాలనుకుంటే అక్కడ ఉండొచ్చని, పర్మినెంట్ జీతగాళ్లకు ఈ ఆఫర్ ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వీటితో పాటు కొత్త ఆఫీస్ బిల్డింగ్, మీటింగ్, కాన్ఫరెన్స్ రూంలు కూడా కట్టించనుంది. అయితే కొత్తగా కట్టే ఆఫీస్‌లో మూడున్నరవేల మందికి స్థానం కల్పించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆ ఆఫీస్ ప్రాంగణంలో కేవలం ఫేస్బుక్ ఎంప్లాయిస్ మాత్రమే సంచరించేందుకు అనుమతి ఇస్తారు. అందరికీ ఇవ్వకపోవచ్చు బెల్లె హవెన్, ఈస్ట్ పాలో అల్టో మధ్య విల్లో సిటీ నిర్మించబోతున్నారు. గతంలో ఫేస్బుక్.. పది మైళ్లలోపు నివసించే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇస్తామని ప్రకటించిన వియం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్ అందరికీ నివాస సౌకర్యం కల్పించపోవచ్చని భావిస్తున్నారు. ఎకరంన్నర స్థలంలో టౌన్ స్క్వేర్ దాని చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్, నాలుగు ఎకరాల్లో పబ్లిక్పార్క్, దాని చుట్టూ రెండు ఎకరాలలో ఓపెన్ స్పేస్‌లు నిర్మించనుంది ఫేస్బుక్. ఇంతకుముందు ఓ భారీ టెక్ పార్క్ కోసం 2017లోనే ఫేస్బుక్ ఓ అప్లికేషన్ సమర్పించినా.. ఇప్పుడు అంకు మించి స్థాయిలోనే రియాలిటీ వరల్డ్‌లోకి రాబోతోంది. ఇదిలా ఉంటే గూగుల్ కూడా కిందటి ఏడాది శాన్ జోస్(కాలిఫోర్నియా)లో నాలుగు వేల అపార్ట్మెంట్లతో డౌన్‌టౌన్ వెస్ట్ పేరిట ఒక సిటీని డెవలప్ చేస్తున్నట్లు పేర్కొంది. -
మెట్రోరైలుకు కదలిక
నాలుగు రూట్లతో ప్రాథమిక నివేదిక రూట్లవారీ భూ సేకరణపై త్వరలో సర్వే సాక్షి, విశాఖపట్నం: మెట్రో రైలు ప్రాజెక్టుపై అధికారుల చర్యలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖతోపాటు గుంటూరు-విజయవాడ మధ్య కూ డా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలున్నాయి. గతంలో ఇవే ప్రాజెక్టులకు కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు సమకూర్చే విధంగా నిబంధనలు రూపొందించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు వ్యయంలో ఏకంగా 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించనున్న నేపథ్యంలో ప్రాజెక్టులపై జీవీఎంసీ త్వరితగతిన సన్నద్ధమవుతోంది. నాలుగు రూట్లు గుర్తింపు! విశాఖ సిటీ డెవలప్మెంట్ ప్లాన్(సీడీపీ)లో భాగంగా గతంలోనే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(ఎంఆర్టీఎస్) పేరిట మూడు మెట్రో కారిడార్లను ప్రతిపాదించారు. వీటిని సీడీపీ రెండో దశలో చేపట్టాలనుకున్నారు. ఇందులో పాతపోస్టాఫీసు నుంచి హనుమంతవాక(8 కి.మీ.), ఆశీలుమెట్ట నుంచి లంకెలపాలెం(15 కి.మీ.), కాన్వెంట్ కూడలి నుంచి పెందుర్తి(20 కి.మీ.) కారిడార్ల ప్రతిపాదనలున్నాయి. ఈలోగానే కేంద్రం మెట్రో రైలు ప్రాజెక్టుతో ముందుకు రావడంతో ఆ ప్రతిపాదనలు మరుగునపడి కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. 20-25 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు కారిడార్లకు ప్రాథమిక సర్వేలు చేశారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే నాలుగు మార్గాలను ఎంపిక చేశారు. జనాభా, జనసాంద్రత అంచనాలు జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల విలీనానికి ముందున్న అంచనాల మేరకు జనాభా, జన సాంద్రత వివరాలను జీవీఎంసీ తన ప్రాథమిక నివేదికలో పొందుపరిచింది. జిల్లాలోని మొత్తం ట్రాఫిక్ రద్దీలో 59 శాతం జీవీఎంసీ పరిధిలోనే నెలకొంది. దీని మేరకు మెట్రోరైలు ప్రాజెక్టుపై అధికారులు ముందుకెళ్లారు. కానీ ప్రస్తుతం ఈ అంచనాల్లో మార్పులు తప్పనిసరికానుంది. స్థల సేకరణ, స్టాప్‌లపై సర్వే! జీవీఎంసీ ప్రతిపాదించిన నాలుగు రూట్లలో ఒకదానిని నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ఏజెన్సీ ఖరారు చేయనుంది. లో కార్బన్ మొబిలిటీ, ట్రాఫిక్ రద్దీ ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. మెట్రోరైలు మార్గంపై నిర్ణయానికొచ్చాక.. నెల రోజుల వ్యవధిలో ఆ మార్గంలో ఎంత స్థలం సేకరించాల్సి ఉంటుంది? స్థలాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కేటగిరీ ఎంతెంత? కిలోమీటర్‌కో స్టాప్ చొప్పున ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయాలన్నదానిపై సర్వే చేపట్టి, సమగ్ర నివేదిక రూపొందించాల్సి ఉంది. గత ప్రతిపాదనల మేరకు కిలోమీటర్‌కు రూ.185 కోట్లు మేర వ్యయ అంచనాలున్నాయని, ప్రాజెక్టు తుది రూపుకొచ్చేసరికి ఈ వ్యయం కిలోమీటర్‌కు రూ.215-220 కోట్లు మధ్య ఉండవచ్చని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ తెలిపారు.