సివిల్ అధికారుల విభజన కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని సివిల్ డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ విభజనను కొలిక్కి తీసు కురావడానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధి కారులు ప్రయత్నాలు ముమ్మరం చేశా రు. కొత్త పోస్టులు సృష్టించి ఇరువైపు లా న్యాయం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా పోలీస్‌శాఖలోని సివిల్ డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ విభజన ఇంకా కొలిక్కి రాలేదు. విభజనకు ముందు రూపొం దించిన 108, 54 జీవోలతో విభజన నిలిచిపోయింది. సీనియారిటీ జాబి తా సవరణతో పాటు అధికారులు రివ ర్షన్కు గురవకుండా కొత్తగా 105 పోస్టులు సృష్టిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ పోస్టులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే కేబి నెట్ ఆమోదానికి వెళ్లనున్నట్లు అధి కారులు తెలిపారు. వీటితో అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీ పదోన్నతులు పొందిన అధికారులతో 2014, 2015, 2016కు సంబంధించిన ప్యానల్ జాబితా రూపొందించనున్నామ న్నారు. దీని వల్ల 2007, 1989 బ్యాచ్ అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి పొందే అవకాశం ఉందన్నారు. కాగా, నూతన పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలపగానే సీనియారిటీ జాబితాతో పాటు కోర్టుల్లో ఉన్న సమస్యలూ పరిష్కారమవుతాయని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.