Civil supplies distribution
-
సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాంగింగ్: మంత్రి కారుమూరి
సాక్షి, విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వర రావు విజయవాడలో బుధవారం సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సప్లై ఎలా జరుగుతుందో మానిటర్ చేయడానికే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ సందర్బంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో సమాచారం అందుతుంది. అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్ చేస్తాము. ఇలా జియో ట్యాంగింగ్ ద్వారా వాహనాన్ని ట్రాక్ చేస్తామన్నారు. ఈ క్రమంలోనే సివిల్ సప్లైలో అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమని అన్నారు. వార్డు మెంటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అంటూ కామెంట్స్ చేశారు. -
‘రేషన్ షాపుల మూసివేతపై కొన్ని పత్రికలు అపోహలు సృష్టిస్తున్నాయి’
తాడేపల్లి: కరోనా సమయంలో రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 9 వెనుకబడ్డ జిల్లాలు, ఎస్సీ, ఎస్టీలు అందరికి ఇస్తామని, ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపులను మూసేస్తామని వస్తున్న వాదనలు పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు తొలగించలేదన్నారు. కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు. కోటీ 50 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం: మంత్రి బొత్స రాష్ట్రంలో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామని, కరోనా వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు మంత్రి. 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందన్నారు. తాము కోటి 50 లక్షల మందికి అదనంగా అందించామని తెలిపారు. ‘ప్రస్తుతం కరోనా తగ్గింది కాబట్టి 3 నెలల నుంచి పునరాలోచన చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేస్తున్నది మన రాష్ట్రమే. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించాం. కేంద్రం ఇచ్చే కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: వనరుల సమీకరణపై సీఎం జగన్ సమీక్ష -
రేషన్‌కు వేలిముద్రలు
రాష్ట్రంలోనే తొలిసారిగా జవహర్‌నగర్‌లో అమలు - నేటినుంచి బయోమెట్రిక్ విధానం ప్రారంభం - ఇంటింటికీ తిరిగి వేలిముద్రల సేకరణ - పది రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియ జవహర్‌నగర్: పౌరసరఫరాల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా జవహర్‌నగర్‌లో దీన్ని ప్రవేశపెడుతున్నారు. 50వేల జనాభా కలిగి 16 రేషన్ దుకాణాలతో ఉన్న జవహర్‌నగర్ గ్రామాన్ని బయోమెట్రిక్ విధానం అమలు కోసం ఎంచుకున్నారు. గ్రామంలో గురువారం నుంచి 16 రేషన్ దుకాణాల పరిధిలోని 15,869 రేషన్‌కార్డుదారుల నుంచి వేలిముద్రలు తీసుకోనున్నారు. 34 బయోమెట్రిక్ మిషన్లను ఉపయోగించి 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడి వేలిముద్రలను తీసుకుంటారు. దీని కోసం దాదాపు 60 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈ విషయమై తహసీల్దార్ దేవుజా మాట్లాడుతూ.. రేషన్‌కార్డు లబ్ధిదారులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా బయోమెట్రిక్‌లో వేలిముద్రలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను కళ్లెం వేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ బయోమెట్రిక్ ఆన్లైన్ విధానాన్ని జవహర్‌నగర్‌లో అమలు చేయనున్నామని, ఇక్కడ విజయవంతమైతే జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అమలులోకి వస్తుందన్నారు.