clean sanitation
-
అబ్బూరు సందర్శన
సత్తెనపల్లి: బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ఎంపికైన సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామాన్ని కేంద్ర బృందం సోమవారం సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి విశ్వనాథ్ గ్రామంలో ఇంటింటికి నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక శ్మశానవాటికలు, గ్రామంలో నాటిన మొక్కలు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందని, అబ్బూరు గ్రామం ఆదర్శవంతంగా ఉందన్నారు. ఆయనతోపాటు ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ఈ భానువీరప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ సోదరి, డ్వామా పీడీ పులి శ్రీనివాసులు, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రామకృష్ణ తదితరులున్నారు. -
సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామానికి ‘షీల్డు’
మంత్రి అయ్యన్నచేతుల మీదుగా అవార్డు అందుకున్న కాట్రపాడు సర్పంచ్ నాగమ్మ కాట్రపాడు (దాచేపల్లి): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా కాట్రపాడు సర్పంచ్ రెడ్డిచర్ల నాగమ్మ షీల్డ్‌ను అందుకున్నారు. గ్రామంలో ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కాట్రపాడును సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ పాల్గొన్ని మంత్రి చేతుల మీదుగా షీల్డ్‌ను అందుకున్నారు. పంచాయతీ ఖాతాలో రూ.2లక్షల నగదును ప్రభుత్వం జమ చేస్తుందని ఆమె చెప్పారు. సర్పంచ్ వెంట పంచాయతీ కార్యదర్శి పి. విజయ్‌కుమార్, ఏపీవో జీ. వెంకటేశ్వర్లు తదితరులున్నారు.