అబ్బూరు సందర్శన
అబ్బూరు సందర్శన
Published Mon, Aug 29 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
సత్తెనపల్లి: బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ఎంపికైన సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామాన్ని కేంద్ర బృందం సోమవారం సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి విశ్వనాథ్ గ్రామంలో ఇంటింటికి నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక శ్మశానవాటికలు, గ్రామంలో నాటిన మొక్కలు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందని, అబ్బూరు గ్రామం ఆదర్శవంతంగా ఉందన్నారు. ఆయనతోపాటు ఆర్‌డబ్ల్యూ ఎస్ ఎస్‌ఈ భానువీరప్రసాద్, ఇరిగేషన్ ఎస్‌ఈ సోదరి, డ్వామా పీడీ పులి శ్రీనివాసులు, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రామకృష్ణ తదితరులున్నారు.
Advertisement
Advertisement