మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక సంస్థ: మిట్టల్
హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు పనులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ కార్య దర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. తొలి దశ పనుల పూర్తికి ప్రణాళికను రూపొందిస్తున్నా మని, ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.
నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంగళవారం సెక్రటేరియెట్లో ఆయన భేటీ అయ్యారు. మూసీపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అధ్యయనం ఆధారంగా నివేదిక రూపొందించ నున్నామన్నారు.