సీనియర్లకు దక్కని చోటు, డీకె అరుణకు భంగపాటు
హైదరాబాద్ : సీఎల్పీ కార్యవర్గంలో సీనియర్లకు భంగపాటు ఎదురైంది. కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) కార్యవర్గాన్ని ప్రతిపక్షనేత జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. డిప్యూటీ లీడర్లుగా గీతారెడ్డి, జీవన్ రెడ్డి, కోమటి రెడ్డి వెంటకరెడ్డి, కార్యదర్శులుగా భట్టి విక్రమార్క, రామ్మోహన్ రెడ్డి నియమితులయ్యారు. విప్‌గా సంపత్, కోశాధికారిగా పువ్వాడ అజయ్ కుమార్ నియామకం అయ్యారు.
మరోవైపు మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లకు భంగపాటు ఎదురైంది. రెడ్యా నాయక్, రాంరెడ్డి వెంకట రెడ్డి, డీకే అరుణలకు సీఎల్పీ కార్యవర్గంలో చోటు దక్కలేదు. కాగా గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత పదవి కోసం జానారెడ్డి, డీకె అరుణ పోటీ పడిన విషయం తెలిసిందే.