దూకుడు నేతల్లో గుబులు
ప్రజలు, ప్రజాసమస్యలను పక్కనబెట్టి అక్రమ ఆదాయ వనరులపై దృష్టిసారించిన ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ నిర్ణయాలు కలవరపెడుతున్నాయి. ‘ తెలంగాణ సెంటిమెంట్‌తో ఓట్లేశారు కదా.. ఐదేళ్ల వరకూ చూద్దాం’ అంటూ సొంత ఎజెండాలో మునిగి తేలుతున్న వారి పాలిట అంకుశంలా మారాయి. వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నాయి.
* ఇందూరు టీఆర్ఎస్లో ‘రాజయ్య’ ఫీవర్
* అవినీతి, ఆరోపణలపై సీఎం నిఘా
* కలవరపెడుతున్న ఇంటలిజెన్స్ నివేదికలు...
* ఇప్పటికే కొందరికి మందలింపు
‘‘అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదాం... అవినీతికి వ్యతిరేకంగా ఉన్నామని కేంద్రంలో మనకు మంచి పేరు ఉంది... కొందరు ఈ పేరును నాశనం చేస్తున్నారు.. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించను... ఏ స్థాయి వారైనా వదిలేది లేదు.. ఈ సందేశాన్ని కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలి ’’
- మంత్రి రాజయ్య బర్తరఫ్ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ‘జాగ్రత్తగా పని చేయండి.. సొంత ఎజెండాలు వద్దు... ప్రజలకు ఉపయోగపడే అంశాలు అనుకున్నప్పుడు మాతో చర్చించండి’ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవడం చర్చనీ యాంశంగా మారింది. ఉన్నతాధికారుల బదిలీ ల్లో మితిమీరిన జోక్యం, ఇసుక వ్యాపారులతో సిండికేట్ దందా, అభివృద్ధి పనుల్లో అధికారుల నుంచి వాటాల వ్యవహారంలో ఇదివరకే ఇద్దరు ప్రజాప్రతినిధులను కేసీఆర్ మందలించినట్లు ప్రచారం ఉంది.
తాజాగా డిప్యూటీ సీఎం రాజ య్యను బర్తరఫ్ చేసిన సీఎం నిఘాసంస్థలు, ప్ర సార మాధ్యమాలు తదితర మార్గాల ద్వారా ప్ర జాప్రతినిధుల పనితీరుపై నివేదికలు సేకరి స్తుండటం జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధుల ను ఆందోళనకు గురి చేస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాల నేపథ్యం లో ఏకంగా ఆ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజ య్యపైనే వేటు పడటం ఇందూరు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు కొత్త పథకాలు, పాల నను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వాధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తూనే.. మరోవైపు ఆయా జిల్లాల్లో పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపైన దృష్టి సారించారు. ఈ మేరకు వివిధ మార్గాల్లో నివేదికలు తెప్పించుకుంటున్న ఆయ న ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తు న్నా... కొందరిలో మార్పు లేదు. రాజయ్యపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గ్రూపు రాజకీయాలతో కాలయాపన చేయాలనుకున్న పలువురు ప్రజాప్రతినిధులను కుదిపి వేసింది.
ఓట్లేసి గెలిపిం చిన ప్రజలను, వారి ప్రయోజనాలను పక్కనబెట్టి అక్రమార్జనకు పాల్పడే వారికి చెంపపెట్టు లా మారింది. ‘‘ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు పట్టం కడితేనే బాగు పడతామనే భావనతోనే ప్రజలు మనకు ఓట్లేశారు.. అధికారంలోకి వచ్చాక తమ బాగోగులే తప్ప కొందరు ప్రజ లను పట్టించుకోవడం లేదు. మీరే అవినీతికి పాల్పడితే అధికారులపై అజమాయిషీ ఎట్లా ఉంటుంది. తీరు మారకపోతే ఎవరూ అతీతులు కారు’’ అంటూ గతంలోను కేసీఆర్ పలువురిని మందలించారు.
బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేయాల్సిన కొందరు పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని పరోక్ష హెచ్చరికలు చేసిన ఆయన చివరకు డిప్యూటీ సీఎం రాజయ్యపై వేటు వేయడంతో ‘దూకుడు’ ఎమ్మెల్యేలు ఇకనైనా వెనక్కి తగ్గుతారన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అధికారుల బదిలీలు మొదలు ప్రభు త్వ పథకాల అమలు వరకు పర్సెంటేజీలు, పవర్ పాలిటిక్స్ చేస్తున్న నేతలను కలవరపెడుతున్నాయి.
ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలు, పార్టీ కార్యకర్తల పట్ల నేతల వ్యవహారంపై కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న వైఖరిపై సిద్ధమైన ఇంటలిజెన్స్ నివేదికలు అల జడి రేపుతున్నాయి. జిల్లాలో మొత్తంగా రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకోగా... ప్రభుత్వంలో పారదర్శకంగా వ్యవహరించేందుకు సీఎం కేసీఆర్ సీనియర్లకు ప్రాధాన్యత కలిగించారు. మొదటి మంత్రివర్గంలోనే బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు.
మలివిడతలో మరో సీనియర్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు ‘విప్’ పదవిని కట్టబెట్టారు. టీఆర్ఎస్లో సీనియర్ అయిన మరో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మంత్రి కోసం ప్రయత్నం చేసినా ఫలించలేదు. పార్లమెంట్ కార్యదర్శుల భర్తీలోనూ జిల్లాకు స్థానం దక్కలేదు. వాటర్‌గ్రిడ్, టీఎస్ఎండీసీ, ఆర్టీసీ తదితర కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం రావచ్చన్న చర్చ ఉంది.
అయితే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయలో చెరువుల మరమ్మతుల పనుల టెండర్ల ఖరారులో ఇద్దరు ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభించే ముందే తమకు 10 శాతం ఇవ్వాలని కాంట్రాక్టర్లకు పత్వా జారీ చేయడంతో ఆ పనులు ముందుకు సాగడం లేదు. పంచాయతీరాజ్ శాఖ కింద 378 రోడ్ల విస్తరణ, నిర్మాణం పనుల కోసం రూ.27.73 కోట్లు విడుదలై టెండర్లయిన ‘పర్సెంటేజీ’ల కారణంగా నాలుగు నెలలుగా పెం డింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి పథకాల అమలు, ప్రజాప్రతినిధుల వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఇంటలిజెన్స్ నివేదికలు కోరడంతో చర్చనీయాంశం అవుతోంది.