సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నం
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ విద్యార్థులు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. తెలంగాణా రాష్ట్ర లోక్ దళ్, విద్యార్థి దళ్ కార్యకర్తలు క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులుకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులును అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
మరోవవైపు అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఇప్పుడు ఒక్క ప్రాంతానికి చెందిన ప్రతినిధిగా మాట్లాడటం సబబు కాదని టీఆర్ఎస్ ఆరోపించింది. ఆ పార్టీ మహిళ విభాగం కార్యకర్తలు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చోటుచేసుకుంది. పోలీసు జూలం నశించాలని మహిళా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.