Coal belt areas
-
మూసిన బొగ్గు గనుల్లో తరగని విద్యుత్..?
సంప్రదాయేతర విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశీయంగా విద్యుత్తులో అధికంగా థర్మల్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్ పార్క్‌లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పనులు నిర్వహించాలని చూస్తోంది. ఇందులో కోల్ ఇండియా రూ.24 వేల కోట్లు సమకూర్చనుందని కొందరు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6 వేల కోట్ల కోసం ప్రైవేట్ సెక్టార్ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కోల్ గ్యాసిఫికేషన్ (కోల్‌ను ఫ్యూయల్ గ్యాస్‌గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్‌ను హైడ్రోజన్, మీథేన్, మిథనాల్, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6 వేల కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్‌ను గ్యాస్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. -
‘సింగరేణి సైరన్’తో బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్
గోదావరిఖని (రామగుండం): సింగరేణి ప్రాంతంలో పట్టుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. త్వరలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పార్టీకి కీలకంగా ఉన్న నాయకుడు.. సింగరేణి సైరన్‌గా గుర్తింపు పొందిన నేతను తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం బీజేపీకి షాకిచ్చిలా ఉంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే బీజేపీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య త్వరలో తన సొంతగూటికి చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్ మేరకే ఆయన బీఎంఎస్‌ను వీడారు. మల్లయ్య టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒంటిచేతితో యూనియన్ను నడిపించాడు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సింగరేణివ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 2003 నుంచి సంఘాన్ని ముందుండి నడిపించారు. సుమారు 16 ఏళ్లు టీబీజీకేఎస్‌లో పనిచేసిన మల్లయ్య నాయకత్వ విభేదాలతో సంఘానికి దూరమయ్యారు. టీఆర్ఎస్ నుంచి కూడా హామీ రాకపోవడంతో పార్టీని వీడారు. అనంతరం 2019 సెప్టెంబర్ 30న బీజేపీ అనుబంధ బీఎంఎస్ (సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్)లో చేరారు. అక్కడ కూడా మల్లయ్య అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చి బీఎంఎస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మల్లయ్య ముందుకెళ్తున్నారు. అయితే బీఎంఎస్‌లో గుర్తింపు రాకపోవడం, తాను ఆశించిన జేబీసీసీఐ సభ్యతం రాకపోవడంతో దీంతో మల్లయ్య అసంతృప్తిలో ఉన్నారు. ఈ కారణంగా మూడు నెలలుగా సంఘం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ అసంతృప్తిని గ్రహించి టీఆర్ఎస్ మళ్లీ ఆహ్వానం పలికింది. ఈ క్రమంలోనే కెంగర్ల మల్లయ్యను తిరిగి టీబీజీకేఎస్, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఇటీవల టీఆర్ఎస్ అధిష్టానంతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ యువ, అధినాయకుడు కచ్చితమైన హామీ ఇవ్వడంతో శుక్రవారం తెల్లవారుజామున బీఎంఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీఎంఎస్‌కు రాజీనామా చేసిన మల్లయ్య గోదావరిఖనిలో తన అనుచరులతో సమావేశమై టీఆర్ఎస్లో చేరే విషయం చర్చించారు. త్వరలో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు కోసం ఇప్పుడే వ్యూహం సిద్ధం చేశారు. -
కోల్‌బెల్ట్‌లో టీఆర్ఎస్, బీజేపీ కోల్డ్‌వార్
కోల్‌బెల్ట్ ఏరియాలో టీఆర్ఎస్, బీజేపీల నడుమ కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరుకుంది. వైరి రాజకీయ పార్టీలుగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సహజమే అయినా ఇందుకు వ్యక్తిగత గ్రూప్‌లు కూడా తోడవడంతో ఓ స్థాయిలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ సాగుతోంది. అవతలి పార్టీని ఇరుకునపెట్టే ఏ అవకాశాన్నీ రెండు పార్టీలు వదలడం లేదు. ఇటీవల ఆర్ఎఫ్సీఎల్కు కేంద్రమంత్రులు వచ్చిన సందర్భంలో జరిగిన ఘటన కూడా ఈ కోవలోనిదేనంటూ ప్రచారం సాగుతోంది. సాక్షి, పెద్దపల్లి: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అడ్డుకున్న ఘటనలో పోలీసుల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడగా, ఒకరిద్దరు పోలీసు అధికారులపై వేటు పడుతోందనే ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది.వైరి పక్షాల్లో చిరకాల ప్రత్యర్థులు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మధ్య అంతర్గత పోరు దశాబ్దాలుగా సాగుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి సోమారపు, రెబల్ అభ్యర్థిగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి పోటీపడడం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత చందర్ నేరుగా అధిష్టానం వద్దకు వెళ్లి మళ్లీ గులాబీ గూటికి చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పూర్తిగా చందర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఎన్నికల తర్వాత కొద్దిరోజులు టీఆర్ఎస్లోనే ఉన్న సోమారపు తన వర్గంతో బీజేపీలో చేరారు. ఇక మాజీ ఎంపీ జి.వివేక్‌కు చివరి నిమిషంలో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించగా, ఆ తర్వాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లోని తన బెర్త్ లాక్కున్న బొర్లకుంట వెంకటేశ్, వివేక్‌ల నడుమ ఆధిపత్యపోరు సహజమే. ఇలా పార్లమెంటు, అసెంబీల్లో నియోజకవర్గాల్లో బలమైన నేతలు ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోవడంతో, కోల్‌బెల్ట్‌లో రాజకీయం ఏదో ఒక అంశంపై నిత్యం రాజుకుంటూనే ఉంటోంది. ఆర్ఎఫ్సీఎల్ ఘటనతో మరోసారి.. మున్సిపల్ కార్పొరేషన్.. సింగరేణి బొగ్గు గనులు.. అంశం ఏదైనా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఎఫ్సీఎల్ ఘటనతో మరోసారి టీఆర్ఎస్, బీజేపీల పోరు బహిర్గతమైంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు కేంద్రమంత్రులు మాండవ్య, కిషన్‌రెడ్డిలను అడ్డుకోవడం, వాగ్వాదానికి దిగడం, కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు.. ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. స్థానికులకు ఉద్యోగాలు రాకపోవడానికి కేంద్రమే కారణమని చెప్పేందుకు, తద్వారా బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కేంద్రమంత్రులు వచ్చిన ప్రతీసారి ఆందోళనలకు దిగుతోంది. అయితే తాము స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెబుతున్నామని, కాని ఉద్యోగాల పేరిట వసూళ్లను అరికట్టాలంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ముందుందా!.. ముగిసిందా..! ఆర్ఎఫ్సీఎల్ ఘటనపై అక్కడే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చినా ముందస్తు అరెస్ట్‌లు చేసే పోలీసులు, తమ పర్యటనలో ఆ విధంగా ఎందుకు వ్యవహరించలేదంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీజీపీ ఆదేశం మేరకు సీపీ సత్యనారాయణ ఘటనపై విచారణ పూర్తి చేసి నివేదిక అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతోనే ఈ వ్యవహారం ముగిసిపోయిందనే ప్రచారం ఉంది. కాని ఒకరిద్దరు పోలీసు అధికారులపై వేటుపడక తప్పదేమోననే అనుమానాన్ని పలువురు పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే పోలీసుల అంచనాలు తప్పడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల పోస్టింగ్‌లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల చేతుల్లోకి వెళ్లిన పరిస్థితుల్లో సహజంగానే రాష్ట్ర అధికార పార్టీ ప్రభావం పోలీసులపై ఎక్కువగా ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ ఆందోళన పట్ల కాస్త ఉదాసీనత ప్రదర్శించారనే విమర్శ ఉంది. అంతేకాకుండా వినతిపత్రం మాత్రమే ఇస్తారని చెప్పడంతోనే కేంద్రమంత్రులు టీఆర్ఎస్ ఆందోళన వద్దకు వెళ్లినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాని కేంద్రమంత్రులను చుట్టుముట్టి నినాదాలు చేయడాన్ని,తోసుకోవడాన్ని పోలీసులు ఊహించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా కిషన్‌రెడ్డి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. పరిస్థితిని పసిగడితే మరో ద్వారం గుండా ఆర్ఎఫ్సీఎల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉండేదని పోలీసులు కూడా చర్చించుకుంటున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలు అధికంగా ఉన్న కోల్‌బెల్ట్‌లో టీఆర్ఎస్, బీజేపీల ఆధిపత్యపోరు సాగుతోంది. రానున్న సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత ఉధృతం కానుంది. -
పోలీసుల అదుపులో మాయలేడి
సాక్షి, బెల్లంపల్లి: కోల్‌బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన మాయలేడీని కాసిపేట పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన ఠాకూర్ సుమలత గత మూడేళ్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ఉద్యోగాల విషయంలో జైపూర్, దేవాపూర్ పవర్ప్లాంట్లలో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ నిరుద్యోగులను కలిసి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు బాధితుల నుంచి వసూలు చేసింది. అనంతరం నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు విసిగి వేసారి వడ్డీ నష్టపోతున్నామని వాదనకు దిగారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సైతం మోసం చేసినట్లు విన్నవించారు. దీంతో విషయం తెలుసుకున్న సుమలత కోర్టు నుంచి ఐపీ తెచ్చుకొని నోటీసులు పంపించింది. బాధితులు సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు చెబుతుండగా నిందితురాలు రూ.80 లక్షలు వరకు వసూలుపై ఐపీ తెచ్చుకుంది. ఉద్యోగాల పేరిట మోసపోయింది పోయి తిరిగి ఐపీ కింద కోర్టు నుంచి నోటీసులు అందుకోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాసిపేట, సోమగూడెం, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, వరంగల్, పర్కాల, హన్మకొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్‌లలో సైతం ఉద్యోగాల పేరిట వసూలు చేసినట్లు తెలిసింది. కాగా బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టి సుమలత కోసం గాలించగా గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరిగింది. ఎట్టకేలకు బుధవారం కాసిపేట పోలీసులు బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. -
సీఓడీ..డిలే!
పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేటీపీఎస్ 7వ దశలో విద్యుత్ ఉత్పత్తికి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనులు శరవేగంగా జరిగినప్పటికీ ఉత్పత్తి మాత్రం అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. 800 మెగావాట్ల బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా నాలుగు రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది. అంతేగాక గత అక్టోబర్‌లోనే సీవోడీ(కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేస్తామని ప్రకటించినప్పటికీ.. నవంబర్‌లో కూడా చేస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. పూర్తిస్థాయి ఉత్పత్తి వస్తేనే సీఓడీకి వెళతామని అధికారులు చెపుతున్నారు. సేఫ్టీ వాల్స్ లీకులు సరిచేయడంతో పాటు బాయిలర్, సిస్టమ్ లోడింగ్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. 11 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా... తెలంగాణ ఏర్పడక ముందు 6,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా, ఆ తర్వాత ఓసీ–2లో 120 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడ జీ–13, జీ–8 బొగ్గు గ్రేడ్లు పుష్కలం. జీ–13 ఉత్పత్తి ఎక్కువ. నెలకు 3.8 లక్షల టన్నుల బొగ్గు లభిస్తోంది. జేవీఆర్ ఓసీ–1, జేవీఆర్ ఓసీ–2ల నుంచి ప్రతిరోజూ 550నుంచి 700 లారీ ల వరకు బొగ్గు రవాణా జరుగుతోంది. 30 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గనుల విస్తరణతో వచ్చే రెండు మూడేళ్లలో సత్తుపల్లి కేంద్రంగా జీఎం కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 25 ఎకరాల్లో సింగరేణి కా ర్మికుల క్వార్టర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. షేప్ నిధుల్లేవు.. పర్యావరణం పట్టదు.. జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ ఏర్పాటప్పుడు ప్రభావిత గ్రామాలైన.. రేజర్ల, కిష్టారం అభివృద్ధికి సింగరేణి నుంచి షేప్ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ 13 ఏళ్ల కాలంలో కేవలం రూ.5కోట్లు మాత్రమే ఇచ్చారు. అవి కూడా ప్రాధాన్యతా ప్రకారం మంజూరు చేయలేదనే విమర్శలున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.2.80కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటనలు చేసినా.. ఇప్పటివరకు విడుదల చేయలేదు. పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. బొగ్గు తవ్వకాలు చేపట్టక ముందు పచ్చదనంతో కళకళలాడిన సత్తుపల్లి పరిసరాల్లో ఇప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఏడాదికి లక్ష మొక్కలు నాటిస్తాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు రూ.15లక్షల విలువైన 65 వేల మొక్కలనే నాటినట్లు సంస్థ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. పలుమార్లు మొక్కలు నాటాలంటూ సత్తుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఆందోళనకు దిగిన సంఘటనలు ఉన్నా.. యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. బాంబు బ్లాస్టింగ్లతో దడ.. బొగ్గు తవ్వకాల్లో భాగంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో చేపట్టే బాంబు బ్లాస్టింగ్ వల్ల ఏడు కిలోమీటర్ల వరకు గ్రామాల్లోని నిర్మాణాలపై ప్రభావం పడుతోంది. దీంతో.. ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చి దెబ్బ తింటున్నాయి. 3 గంటల నుంచి 3.30 వరకు జరిగే పేలుళ్లతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఒక్కోసారి అధిక మోతాదుతో భూమి కంపిస్తోందని, ఓసీ–2 సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఆందోళనలు చేసి.. సింగరేణి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఉసురు తీస్తున్న బొగ్గు లారీలు.. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం గౌతంఖనికి రోడ్డుమార్గంలో నిత్యంలారీల్లో బొగ్గును సరఫరా చేస్తు న్నారు. వందలాది టిప్పర్లు తిరుగుతుండడంతో విపరీతమైన దుమ్ము లేచి వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పెద్దపెద్ద బొగ్గు పెళ్లలు జారి పడుతున్నాయి. అధిక లోడు, మితిమీరిన వేగంతో రవాణా కారణంగా ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 132 మంది మృత్యువాత పడ్డారు. 87 మంది క్షతగాత్రులైనట్లు పోలీసుల విచారణలో తేలింది. 2019కల్లా బొగ్గు రవాణా కోసం రైల్వేలైన్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ.. భూసేకరణ ప్రక్రియ మాత్రమే ముగిసింది. -
అక్కడ మరణం నిషేధం
ఓస్లో: నార్వేలోని ఆ పట్టణంలో మరణం నిషేధం. ఆర్కిటిక్ ద్వీపకల్ప ప్రాంతంలో ‘లాంగ్యర్‌బీన్’ అనే ఆ బొగ్గుగనుల పట్టణంలో అతి శీతల ఉష్ణోగ్రతల వల్ల మృతదేహాలు ఎన్నటికి మట్టిలో కలిసే పరిస్థితి లేదు. అందువల్ల మృతదేహాలతో పాటు వాటిలోని వైరస్, బ్యాక్టీరియాలు కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ భయంతోనే అక్కడ చావుపై పూర్తిగా నిషేధమే పెట్టారు. అందుకోసం 2017లో ఓ చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. 1918లో స్పానిష్ ఫ్లూ వైరస్ బారిన పడి మరణించిన వారి మృతదేహాల్లో ఇప్పటికీ ఆ ఫ్లూ జాడలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎందుకీ పరిస్థితి.. నార్వే ఉత్తర ప్రాంతంలో మారుమూల స్వాల్బార్డ్ ద్వీపకల్పాల సమూహంలో ఉన్న లాంగ్యర్‌బీన్ పట్టణ జనాభా దాదాపు 2 వేలు. ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రత –17 డిగ్రీలు కాగా అత్యల్పంగా –46.3 డిగ్రీలకు పడిపోతుంది. ఏడాదిలో నాలుగు నెలల పాటు సూర్యుడి జాడే ఉండదు. భూమిలో ‘పెర్మ ఫ్రాస్ట్’ అనే వాతావరణ పరిస్థితి కారణంగా పాతిపెట్టిన మృతదేహాలు కుళ్లిపోవు. దీనిని 1950లో అధికారులు గుర్తించారు. పెర్మా ఫ్రాస్ట్ అంటే మట్టి లేదా రాతిలో ఉష్ణోగ్రతలు ఎప్పటికీ సున్నా లేదా అంతకంటే తక్కువ డిగ్రీలు ఉండడమే.. ఈ పరిస్థితి కారణంగా చాలా సందర్భాల్లో మృతదేహాలు భూమి ఉపరితలంపైకి కూడా వచ్చేస్తాయి. 1950 తర్వాత ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలు పెట్టారు. మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ జాడలు 1918లో ప్రాణాంతక ‘స్పానిష్ ఫ్లూ వైరస్’ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో మరణించిన వారి 11 మృతదేహాలు ఇప్పటికీ లాంగ్యర్‌బీన్‌లో ఉన్నాయి. ‘పెర్మ ఫ్రాస్ట్’ ప్రభావంతో ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే ఆ మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ వైరస్ కూడా ఇంకా సజీవంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 1998, ఆగస్టులో నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్కు చెందిన కర్స్టి డంకన్ లాంగ్యర్‌బీన్‌లో పరిశోధనలు నిర్వహించారు. ఫ్లూతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇంకా బతికే ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. మరణాల్ని నిషేధిస్తూ 2017లో చట్టం.. భూమి శాశ్వతంగా ఘనీభవన స్థితిలో ఉండడంతో పాతిపెట్టిన శవాలు కుళ్లిపోకుండా.. ఉపరితలం పైకి వస్తున్నందున 2017లో అక్కడ మరణాలపై చట్టం చేసినట్లు నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ క్రిస్టియన్ మేయర్ తెలిపారు. అక్కడ ప్రాణాంతక వైరస్ స్థానికులకు సోకకుండా ఉండేందుకు మరణానికి చేరువలో ఉన్న వారిని నార్వేలోని ప్రధాన భూభాగానికి వెంటనే తరలిస్తారు. ఒకవేళ ఎవరైనా అకస్మాత్తుగా అక్కడ మరణించినా, అక్కడే మరణించాలని కోరుకున్నా.. వారి అంతిమ సంస్కారాల్ని అక్కడ నిర్వహించరు. అయితే వారి అస్థికలను అక్కడి భూమిలో పూడ్చేందుకు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం. -
పార్టీలకు యూనియన్ల ఝులక్
శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : సింగరేణి పరిధి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మునిసిప ల్, సార్వత్రిక ఎన్నికల్లో గని కార్మికుల ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థుల ను గెలిపించుకోవాలంటే పార్టీలు యూనియన్లపైనే ఆధారపడాలి. ఓటర్లను ప్రభావితం చేయడంలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో ఉంటుంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు వాటి అనుబంధ కార్మిక సంఘాల నేతలు ఏమాత్రం సహకరించడం లేదు. ఎన్నికల ప్రచారానికి ఆయా సంఘాల నేతలు దూరంగా ఉంటున్నా రు. దీంతో అభ్యర్థులు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా సింగరేణిలో అతిపెద్ద డివిజన్ అయిన శ్రీరాంపూర్‌లో ఈ పరిస్థితి నెలకొంది. టీబీజీకేఎస్‌లో గ్రూపుల తలనొప్పి సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)లో నెలకొన్న అంతర్గత నాయకత్వ సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ మద్దతిచ్చిన మల్లయ్య వర్గం ఓడిపోవడం, పార్టీకి సంబం ధం లేదన్న రాజిరెడ్డివర్గం గెలుపొందింది. తరువాత క్రమంలో రాజిరెడ్డి వర్గం కూడా టీఆర్ఎస్ అధ్యక్షుడిని కలిసి పార్టీకి టచ్‌లో ఉండటం తో మల్లయ్య శిబిరంలో ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఈ రెండు గ్రూపులను సమన్వయం చేయడం స్థానిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఏ వర్గం నేతలు కూడా పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనడం లేదు. మల్లయ్య వర్గం మద్దతు తీసుకుంటే రాజిరెడ్డి వర్గం వ్యతిరేకం అవుతుంది. రాజిరెడ్డి వర్గం మద్దతు తీసుకుందామంటే మల్లయ్య వర్గం నుంచి సహకారం ఉండదు.. ఎటోచ్చి కొంప మునుగుతుందనే ఆందోళన పార్టీ నేతల మెదళ్లను తొలుస్తోంది. ఇదిలా ఉంటే మంచిర్యాల మండలంలో టీఆర్ఎస్, సీపీఐ పొత్తు ఉంది. మొత్తం 31 స్థానాలు ఉంటే అందులో కోల్‌బెల్ట్‌లో ఆరు స్థానాలను సీపీఐకి ఇచ్చారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకోసం టీబీజీకేఎస్ నేతలు ప్రచారం చేయకున్నా ఏఐటీయూసీ నేతలు అక్కడక్కడా ప్రచారం చేయడం గమనార్హం. ఐఎన్టీయూసీలోనూ అదే పరిస్థితి సింగరేణిలో ఒకప్పుడు ఐఎన్టీయూసీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఐఎన్టీయూసీ అనే విధంగా ఉండేది. ఏడాదిన్నర కాలంగా పార్టీకి, యూనియన్‌కు మధ్య సమన్వయం లోపించిం ది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కాంగ్రెస్‌కు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ప్రకటన చేయడంతో పార్టీకి, యూనియన్‌కు మధ్య వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఐఎన్టీయూసీ శ్రే ణులు ప్రేంసాగర్‌రావుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నా రు. అంతే కాకుండా కోల్‌బెల్ట్‌లో తాము సూచించిన వారికి టికెట్ ఇవ్వలేదని డివిజన్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆ కోపాన్ని కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా చూపుతూ అభ్యర్థులకు సహకరించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రత్యర్థులకు లాభం చేకూరుతుందని పార్టీ శ్రేణులు ఆందోళ న చెందుతున్నాయి.