coalbelt
-
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు వినిపించారు. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌కు సీఎం ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ మేరకు పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనుంది. దీంతోపాటు రామగుండంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వీటికి సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. ‘సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు’ అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సమీక్ష చేసిన అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ విప్ మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆంత్రం సక్కు, సిర్పూర్ ఖాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘తూర్పూ’లో నయీం అడ్డా
గతంలో నయీం అనుచరుడి అరెస్టు ఇక్కడా భూ దందాలు మంచిర్యాల సిటీ : మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ మహ్మద్ నయీమొద్దీన్ ఉరఫ్ నయీమ్ అడుగులు జిల్లాలోనూ పడ్డాయి. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో నÄæూమ్ మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా తూర్పు ప్రాంతంలోనే అతడికి ఎక్కువ అనుచరులు ఉన్నట్టు సమాచారం. జన్నారం మండలం మందపెల్లి గ్రామానికి చెందిన ఒకరు నయీమ్‌కు అనుచరుడుగా పనిచేశాడు. భూదందా కేసులో అతన్ని పదేళ్ల కిందట జిల్లా పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. పశ్చిమ ప్రాంతం కంటే తూర్పు ప్రాంతమైన కోల్‌బెల్ట్‌లోనే అతనికి ఎక్కువ స్థావరాలు ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడికి సంబంధించిన అనుచరులు ఈ ప్రాంతం వారు ఉన్నప్పటికీ వారంతా ఎక్కువగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అతడి పేరుతో ఇక్కడ దాడులు చేయకుండా భూదందాలు చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. స్థావరాలు.. నయీమ్ 1980లో మావోయిస్టులో చేరాడు. దళంలో చురుగ్గా వ్యవహారించే అతను జూన్ 27, 1993లో ఐపీఎస్ అధికారి వ్యాస్‌ను హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో కాల్చి చంపాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నయీమ్ 2001లో అరెస్టు అయ్యాడు. హైదరాబాద్‌లోని కోర్టు తీర్పు వెలువడుతుండగానే అక్కడినుంచి తప్పించుకున్నాడు. అదే సమయంలో కోల్‌బెల్ట్ ప్రాంతాలైన శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో అతని స్థావరాలు ఏర్పడ్డాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి నుంచి కొద్ది›రోజులు నాగపూర్ ప్రాంతంలో కొద్ది రోజులు గడిపినట్టుగా సమాచారం. అక్కడి నుంచే తన అరాచకాలను కొనసాగించాడు. తప్పించుకున్న తర్వాత నయీమ్ హైదరాబాద్ నుంచి నేరుగా కోల్‌బెల్ట్ ప్రాంతంతోపాటు నాగపూర్ వరకు రైలు ద్వారా ప్రయాణించే సౌకర్యం ఉండడంతో తన స్థావరాలతోపాటు అనుచరులను కూడా ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. అతని ఆచూకీ కోసం కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో గాలింపు చేపట్టినప్పటికీ చిక్కలేదు. ఇక్కడ తన అనుచరులను ఏర్పాటు చేసుకుని భూదందాలు, సెటిల్మెంట్లు కూడా చేశాడని పోలీస్ వర్గాలు పసిగట్టాయి. ఎక్కడ కూడ తన అనుచరులు పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలు హైదరాబాద్ నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాలకు వచ్చి విచారించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అతని అనుచరులుగా ముద్రపడ్డ వారంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారని, కాని ఇక్కడ వారు ఎలాంటి ప్రమాదకరమైన సంఘటనలకు మాత్రం పాల్పడలేదు. పదేళ్ల కిందట జన్నారం మండలం మందపల్లి నివాసిని నయీమ్ అనుచరుడిగా గుర్తించారు. భూదందా సంఘటనలోనే అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. మందపల్లి నివాసి మినహా నేటి వరకు అనుచరుల్లో ఎవ్వరు కూడా పోలీసులకు చిక్కకుండానే మిగిలిపోయారు. -
ఆశ.. నిరాశే !
తెలంగాణలోని నాలుగు జిల్లాలకు కొంగుబంగారమైన సింగరేణిలో ఉద్యోగాలు కరువయ్యూరుు. ఉపాధీ దొరకని పరిస్థితి. నాలుగేళ్ల క్రితం గనుల్లో ఉపయోగించే సుమారు 27 రకాల ఉత్పత్తుల తయూరీకి అవకాశం కల్పిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం.. తీరా ముఖం చాటేసింది. ఫలితంగా సింగరేణి ప్రాంత నిరుద్యోగుల జీవితాలు అగమ్యగోచరమయ్యూరుు. గోదావరిఖని : సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు కరువయ్యాయి. కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు, సాంకేతిక విద్యనభ్యసించిన సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులు అనుబంధ పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకోవాలని 2011 ఫిబ్రవరి 11వ తేదీన సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన 200 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. యూజమాన్యం మొదట 2011 నవంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో 13 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం అప్పటి సింగరేణి సీఎండీ ఎస్.నర్సింగరావు, కలెక్టర్ స్మితా సబర్వాల్ చర్యలు తీసుకున్నారు. రూఫ్‌బోల్టింగ్, ఫష్ ప్లేట్లు, మోటర్ వైండింగ్, హౌస్ వైరింగ్, ఫ్యాబ్రికేషన్ వ ర్క్, మెష్ వర్క్, బోల్ట్స్, నట్స్ తదితరాల తయూరీకి నిర్ణరుుంచారు. సింగరేణి యూజమాన్యం వర్క్‌షాపు స్థలాన్ని కేటారుుంచింది. పరిశ్రమలు నెలకొల్పిన నిరుద్యోగులకు ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకులు రూ. 10 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు రుణం మంజూరు చేశారుు. దీంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ఉత్పత్తులను తయారీ చేపట్టారు. యూజమాన్యం మాత్రం వ స్తువులను తీసుకోవడంలేదు. అవే వస్తువులను విజయవాడలోని అప్మెల్ సంస్థ, నాగ్‌పూర్‌లోని పరిశ్రమల నుంచి తెప్పించుకుంటోంది. ఫలితంగా నిరుద్యోగులకు ఉపాధి కరువైంది. యంత్రాలన్నీ పనిలేక మూలన పడ్డారుు. బ్యాంకుల్లో గ్యారంటీ పెట్టిన కార్మికుల వేతనాల నుంచి మాత్రం నెలవారీ వాయిదాలను అధికారులు కోత విధిస్తున్నారు. దరఖాస్తులు వీటి కోసం.. ఓపెన్‌కాస్ట్‌లో ఉపయోగించే రూఫ్‌బోల్ట్‌లు ఎమ్ఎస్ బోల్టులు, నట్లు, రివీట్స్, వాషర్స్, స్క్రూస్, డాగ్ నైల్స్, ఫిష్ ప్లేట్లు బెల్ట్ జాయింటింగ్ పిన్స్, కేబుల్ హుక్స్, సిగ్నల్ హుక్స్, బెల్ట్ కన్వేయర్ రోలర్స్ బెల్ట్ సెక్షన్స్, రెసిన్, సిమెంట్ క్యాప్సూల్స్ జీఐ కానిస్టర్స్, బ్లాస్టింగ్ గ్యాలరీ-స్పేసర్స్, రేడియేటర్ రిపేర్స్ ఏసీ, డీసీ మోటార్ల మరమ్మతులు, రివైండింగ్ పనులు, ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ జీఐ వైర్ తయారీ, లాంగ్వాల్ సాల్వేజీకి వైర్ మెష్, ఎలక్ట్రీకల్ కాయిల్స్ తయారీ ఎలక్ట్రిక్ మోటర్ కోసం రోటర్స్ రిపేర్, లైటింగ్ కేబుల్, స్టీల్ చౌక్ తయారీ హౌస్ వైరింగ్, ఫ్యాన్ల రిపేర్, షావల్ బకెట్ వెల్డింగ్, పంప్ రిపేర్, కప్లింగ్ తయారీ, ప్రత్యేక స్టీల్, అల్లాయ్ కాస్టింగ్ ఇలా 27 వస్తువులను తయారు చేసేందుకు నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. చర్యలు శూన్యం... అనుబంధ పరిశ్రమలు ప్రారంభించిన తర్వాత యువత తయారు చేసే విడి భాగాలకు 30 శాతం మార్కెట్ గ్యారంటీ కల్పించనున్నట్లు సింగరేణి సంస్థ హామీ ఇచ్చింది. యువతకు హైదరాబాద్‌కు చెందిన ఖాదీ గ్రామోద్యోగ మహాలయ వారిచే శిక్షణ ఇప్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్న ఆలోచన కూడా అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ చేశారు. ఇందుకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కూడా మంథని మండలం సిరిపురం వద్ద కేటాయించేందుకు పరిశీలించారు. 2012 సెప్టెంబర్ 3వ తేదీన కరీంనగర్లో సింగరేణి అధికారులు, బ్యాంకర్లు, డీఆర్డీఏ, ఇతర పరిశ్రమల అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి అనుబంధ పరిశ్రమల ప్రారంభమే తరువారుు అన్నట్లు ప్రకటించారు. అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించి నాలుగేళ్లు కావస్తున్నా.. ఇటు ప్రభుత్వం గానీ.. అటు సింగరేణి యాజమాన్యం గానీ ఏ విధంగానూ స్పందించడం లేదు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మాత్రం జీఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ‘పెద్దల’పైనే భారం... నిరుద్యోగులు, సింగరేణి కార్మికుల పిల్లలకు ఉపాధిని కల్పించేందుకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని అప్పటి సీఎండీ ఎస్.నర్సింగరావు, కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ నిర్ణరుుంచారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత పరిశ్రమలను ప్రోత్సహిస్తారని నిరుద్యోగులు ఆశతో ఉన్నారు.