ఆశ.. నిరాశే ! | Hope .. disappointed! | Sakshi
Sakshi News home page

ఆశ.. నిరాశే !

Published Thu, Sep 25 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ఆశ.. నిరాశే !

ఆశ.. నిరాశే !

తెలంగాణలోని నాలుగు జిల్లాలకు కొంగుబంగారమైన సింగరేణిలో ఉద్యోగాలు కరువయ్యూరుు. ఉపాధీ దొరకని పరిస్థితి. నాలుగేళ్ల క్రితం గనుల్లో ఉపయోగించే సుమారు 27 రకాల ఉత్పత్తుల తయూరీకి అవకాశం కల్పిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం.. తీరా ముఖం చాటేసింది. ఫలితంగా సింగరేణి ప్రాంత నిరుద్యోగుల జీవితాలు అగమ్యగోచరమయ్యూరుు.
 
 గోదావరిఖని :
 సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు కరువయ్యాయి. కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు, సాంకేతిక విద్యనభ్యసించిన సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులు అనుబంధ పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకోవాలని 2011 ఫిబ్రవరి 11వ తేదీన సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన 200 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. యూజమాన్యం మొదట 2011 నవంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో 13 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం అప్పటి సింగరేణి సీఎండీ ఎస్.నర్సింగరావు, కలెక్టర్ స్మితా సబర్వాల్ చర్యలు తీసుకున్నారు. రూఫ్‌బోల్టింగ్, ఫష్ ప్లేట్లు, మోటర్ వైండింగ్, హౌస్ వైరింగ్, ఫ్యాబ్రికేషన్ వ ర్క్, మెష్ వర్క్, బోల్ట్స్, నట్స్ తదితరాల తయూరీకి నిర్ణరుుంచారు. సింగరేణి యూజమాన్యం వర్క్‌షాపు స్థలాన్ని కేటారుుంచింది. పరిశ్రమలు నెలకొల్పిన నిరుద్యోగులకు ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకులు రూ. 10 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు రుణం మంజూరు చేశారుు. దీంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ఉత్పత్తులను తయారీ చేపట్టారు. యూజమాన్యం మాత్రం వ స్తువులను తీసుకోవడంలేదు. అవే వస్తువులను విజయవాడలోని అప్మెల్ సంస్థ, నాగ్‌పూర్‌లోని పరిశ్రమల నుంచి తెప్పించుకుంటోంది. ఫలితంగా నిరుద్యోగులకు ఉపాధి కరువైంది. యంత్రాలన్నీ పనిలేక మూలన పడ్డారుు. బ్యాంకుల్లో గ్యారంటీ పెట్టిన కార్మికుల వేతనాల నుంచి మాత్రం నెలవారీ వాయిదాలను అధికారులు కోత విధిస్తున్నారు.
 దరఖాస్తులు వీటి కోసం..
     ఓపెన్‌కాస్ట్‌లో ఉపయోగించే రూఫ్‌బోల్ట్‌లు
     ఎమ్‌ఎస్ బోల్టులు, నట్లు, రివీట్స్, వాషర్స్, స్క్రూస్, డాగ్ నైల్స్, ఫిష్ ప్లేట్లు
     బెల్ట్ జాయింటింగ్ పిన్స్, కేబుల్ హుక్స్, సిగ్నల్ హుక్స్, బెల్ట్ కన్వేయర్ రోలర్స్
     బెల్ట్ సెక్షన్స్, రెసిన్, సిమెంట్ క్యాప్సూల్స్
     జీఐ కానిస్టర్స్, బ్లాస్టింగ్ గ్యాలరీ-స్పేసర్స్, రేడియేటర్ రిపేర్స్
     ఏసీ, డీసీ మోటార్ల మరమ్మతులు, రివైండింగ్ పనులు, ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్
     జీఐ వైర్ తయారీ, లాంగ్‌వాల్ సాల్వేజీకి వైర్ మెష్, ఎలక్ట్రీకల్ కాయిల్స్ తయారీ
     ఎలక్ట్రిక్ మోటర్ కోసం రోటర్స్ రిపేర్, లైటింగ్ కేబుల్, స్టీల్ చౌక్ తయారీ
     హౌస్ వైరింగ్, ఫ్యాన్ల రిపేర్, షావల్ బకెట్ వెల్డింగ్, పంప్ రిపేర్, కప్లింగ్ తయారీ, ప్రత్యేక స్టీల్, అల్లాయ్ కాస్టింగ్
 ఇలా 27 వస్తువులను తయారు చేసేందుకు నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
 చర్యలు శూన్యం...
 అనుబంధ పరిశ్రమలు ప్రారంభించిన తర్వాత యువత తయారు చేసే విడి భాగాలకు 30 శాతం మార్కెట్ గ్యారంటీ కల్పించనున్నట్లు సింగరేణి సంస్థ హామీ ఇచ్చింది. యువతకు హైదరాబాద్‌కు చెందిన ఖాదీ గ్రామోద్యోగ మహాలయ వారిచే శిక్షణ ఇప్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్న ఆలోచన కూడా అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ చేశారు. ఇందుకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కూడా మంథని మండలం సిరిపురం వద్ద కేటాయించేందుకు పరిశీలించారు. 2012 సెప్టెంబర్ 3వ తేదీన కరీంనగర్‌లో సింగరేణి అధికారులు, బ్యాంకర్లు, డీఆర్‌డీఏ, ఇతర పరిశ్రమల అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి అనుబంధ పరిశ్రమల ప్రారంభమే తరువారుు అన్నట్లు ప్రకటించారు. అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించి నాలుగేళ్లు కావస్తున్నా.. ఇటు ప్రభుత్వం గానీ.. అటు సింగరేణి యాజమాన్యం గానీ ఏ విధంగానూ స్పందించడం లేదు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మాత్రం జీఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
 ‘పెద్దల’పైనే భారం...
 నిరుద్యోగులు, సింగరేణి కార్మికుల పిల్లలకు ఉపాధిని కల్పించేందుకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని అప్పటి సీఎండీ ఎస్.నర్సింగరావు, కలెక్టర్‌గా స్మితా సబర్వాల్  నిర్ణరుుంచారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత పరిశ్రమలను ప్రోత్సహిస్తారని నిరుద్యోగులు ఆశతో ఉన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement