నేడు మానిటరింగ్ కమిటీ సమావేశం
ముకరంపుర: జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు. మానిటరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కో చైర్మన్లు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీలు బాల్కసుమన్, కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 28 శాఖల అధికారులతో సమీక్షించనున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్ప్సన్ హాజరవుతారని తెలిపారు. ఎంపీపీలు హాజరు కావాలని కోరారు.