Collectors Camp Office
-
పార్క్లో సహాయ కలెక్టర్ సస్మిత డెడ్బాడీ.. ఆత్మహత్య లేక హత్యా?
భువనేశ్వర్: అదనపు కలెక్టర్ కార్యాలయంలో సహాయ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మహిళ మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. అయితే, ఆమె మృతికి ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. రుర్కెలాలో అదనపు కలెకర్ట్ ఆఫీసులో రాజగంగపూర్ ప్రాంతానికి చెందిన సస్మిత మింజ్ (35) సహాయ కలెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే, పార్కులో ఉన్న జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ నెల 15న సస్మిత విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 17వ తేదీన ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. తల్లి, సోదరుడు హోటల్కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా అందుకు ఆమె నిరాకరించారు. అయితే, కార్యాలయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం పార్కులో ఉన్న జలాశయంలో ఓ మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం సహాయ కలెక్టర్ది అని గుర్తించారు. జలాశయం తీరంలో ఆమె హ్యాండ్బ్యాగ్, చెప్పులు లభించాయి. ఆమె కుటుంబ సభ్యులు మృతి చెందిన సస్మిత మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. అనంతరం, మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అదనపు కలెక్టర్ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఆమెను మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని లేదా హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పార్క్ పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: యూపీలో మరో ఎన్కౌంటర్.. మహిళా కానిస్టేబుల్పై దాడిలో.. -
కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన కరాటే కల్యాణి
-
అభివృద్ధి వేగవంతం చేయండి
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవార రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలీటీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూం పథకం కింద గ్రామాల్లో, పట్టణాల్లో భూములను గుర్తించి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. జీ ప్లస్ టు ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ద్వారా పూర్తి చేస్తామని అన్నారు. పశువుల కోసం షెడ్ల నిర్మాణాలు చేపట్టాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా జీప్లస్ టు ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేయాలని పేర్కొన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున కేఆర్కే కాలనీ, ఖండాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో 11 ట్రాక్టర్ల ద్వారా తాగునీరు ప్రజలకు అందిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మంగతాయారు తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ ఆధీనంలో ఉన్న భూములలో స్మృతి వనం, చిన్నపిల్లల పార్కు ఏర్పాటు చేయాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ సూచించారు. ఈ సమావేశంలో జేసీ కృష్ణారెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ మారుతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మూర్తి, ఎస్సీ సంక్షేమ అధికారి కిషన్, కార్పోరేషన్ ఈడీ శంకర్, ఆర్అండ్బీ ఈఈ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.