కార్పొరేట్ కాలేజీల పీఆర్ఓల అరెస్ట్
హైదరాబాద్: విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్న కార్పొరేట్ కాలేజీల పీఆర్ఓలను కేపీహెచ్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. మెడికల్ కౌన్సెలింగ్ కు వచ్చిన విద్యార్థులను వీరు తప్పుదోవ పట్టించారు.
అంతేకాకుండా తమ కాలేజీల్లో ఎంసెట్ లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో 10 మంది పీఆర్ఓలను విద్యార్థులు కౌన్సెలింగ్ అధికారులకు అప్పగించారు. తర్వాత వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.