colours speciality
-
ఎన్నెన్నో వర్ణాలున్నా కానీ.. నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్..
ఎన్నెన్నో వర్ణాలు.. కానీ నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్ ఇంకే కలర్‌కూ ఉండదు! ఆ రెండిటినీ కలిపితే కనిపించే రిచ్‌నెస్‌ని చూస్తూండిపోవలసిందే! అదో క్లాసిక్ కాంబినేషన్! దాన్ని ఇంటికీ అద్దితే.. ఆ అభిరుచిని మెచ్చుకోని అతిథి ఉండరు! ఓనర్స్ ప్రైడ్.. నెయిబర్స్ ఎన్వీగా ఫీలయ్యేలా బ్లాక్ అండ్ వైట్‌ని ఇంటి అలంకరణలో మిళితం చేయాలంటే ఈ కింది చిట్కాలను ఫాలో అయితే సరి..!గోడలు, ఫర్నిచర్, ఆర్ట్.. ఎందులోనైనా తెలుపు రంగును డామినేట్ చేస్తూ ఒక వంతు నలుపు రంగు ఉండేలా చూసుకోవాలి. మన కళ్లు సహజంగా నల్లటి వస్తువులను ఆకర్షిస్తాయి. అందుకే వాటిని తక్కువగా ఉపయోగించాలి.ఏ స్థలానికి లేదా గదికి ఎంతమేర బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అవసరమో స్కేల్ సాయంతో సెలెక్ట్ చేసుకోవాలి. అంత కచ్చితత్వాన్ని పాటిస్తేనే ఈ డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.నలుపు– తెలుపు కాంబినేషన్లో చెక్స్ డిజైన్ని జోడించవచ్చు.అలంకరణలో తెల్లని గోడపైన నల్ల రంగులో సంగీత పరికరాలు, ప్యాటర్న్ ఫ్రేమ్‌లు, ఐరన్ లైట్స్ వంటివి వాడుకోవచ్చు.నలుపు– తెలుపు డిజైన్లలో కూడా ఇతర షేడ్స్ ఉంటాయి. కలర్స్‌ని న్యూట్రల్‌గా ఉపయోగించడం వలన డిజైన్లలో రిచ్‌లుక్ వస్తుంది.గది అంతా వైట్ పెయింట్ ఉండి మిగతా అలంకరణకు చాకోలెట్, నలుపు రంగులో ఉండే పెయింట్స్, వుడెన్ షో పీసెస్, కుండలు, కుండీలు, బుక్ ర్యాక్స్ వంటివీ అలంకరణకు ఉపయోగించవచ్చు.బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ని ఎంచుకుంటే.. దాన్ని మనకు నచ్చినట్టు సులభంగా మార్చుకునే వీలుంటుంది. -
ఫ్రెండ్షిప్ బ్యాండ్ రంగుల విశిష్టతలు ఇవే..
ఫ్రెండ్ ఫిప్ బ్యాండ్ ఒక్కోరంగుకు ఒక్కో విశిష్టత ఉంది. అవి ఎరుపు రంగు: ప్రేమకు, సంతోషానికి, శక్తికి చిహ్నం. ఆకుపచ్చ: యవ్వనం, పకృతి, ఆశ, అదృష్టాలకు ప్రతిరూపం. నీలం: ప్రశాంతత, సోదరభావానికి ప్రతీక. నలుపు: ఏకాంతం, దుఃఖాలకు సూచిక. పసుపు: ధనం, బంగారం, ప్రేమలకు నిదర్శనం. తెలుపు: చల్లదనం, స్వచ్ఛత, ప్రశాంతతకు ప్రమాణం.