నేడు అలీ సంస్మరణ సభ
లూయిస్విల్లే: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ సంస్మరణ సభలో పాల్గొనేందుకు అభిమానులు పోటీపడ్డారు. శుక్రవారం జరిగే మెమోరియల్ టిక్కెట్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు 15 వేల టిక్కెట్లను పంపిణీ చేశారు.
తన మరణానంతరం జరిగే సంస్మరణ సభకు అభిమానులను ఉచితంగానే ఆహ్వానించాలని అలీ చెప్పినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్, కమెడియన్ క్రిస్టల్ ఉపన్యసిస్తారు.