comes out
-
ఎంపీలు ఒత్తిడి తెస్తే ‘జోన్’ ఖాయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎంపీలు సహకరిస్తే విశాఖ రైల్వే జోన్ త్వరగా వస్తుందని రైల్వే బోర్డు మెంబర్ జాన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్లో రైల్వేకు అధిక కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు వెయ్యి కోట్లు అవసరం ఉంటుందని, జోన్ నిర్ణయం జరిగితే ఈ బడ్జెట్లో కొంత కేటాయింపులు జరుగుతాయని వివరించారు. జోన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ విశాఖ ఎంపీలు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవడం లేదని, వారు ఒత్తిడి తెస్తే జోన్ సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎంపి హరిబాబు బోర్డు వద్ద జోన్ అంశం ప్రస్తావనకు తేలేదని, వేరే సమస్యలు తప్ప విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఆయన కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. -
15 రోజుల సమాధి తర్వాత ..
పట్నా: పదిహేను రోజుల సమాధి తర్వాత ఓ బాబా ఆరోగ్యంగా బయటికి వచ్చాడన్న వార్త బిహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బిహార్‌లోని మాధేపురా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 అడుగుల లోతైన గొయ్యిలోకి 15 రోజుల తర్వాత ప్రమోద్ బాబా సురక్షితంగా బయటకు వచ్చిఆశ్చర్యపరిచాడని భక్తులు చెప్పారు. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం చౌసా పోలీసు స్టేషన్ పరిధిలోని భట్కాగా గ్రామంలో గత ఫిబ్రవరి 28 న సమాధి చేసుకున్నాడు. సుమారు 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతు తవ్విన గుంతలో మంచం మీద కూర్చున్న స్థితిలో బాబా సమాధిలోకి వెళ్లాడని బాబా భక్తులు చెప్పారు. అనంతరం ఆగుంతపై గుడ్డతో కప్పిం వుంచామన్నారు. విషయం తెలుసుకున్న తెలుసున్న కొంతమంది జిల్లా ఉన్నతాధికారులు, డాక్లర్ల బృందం అక్కడికి చేరుకుని, బాబాను వారించాలని చూసింది. కానీ బాబా సాధనకు అడ్డురావద్దని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు వెనుతిరిగారని గ్రామస్తులు చెప్పారు. అయితే బాబా ఆరోగ్యంగా ఉన్నాడని మధేపురా జిల్లా ఎస్పీ వికాస్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. బాబా ఆరోగ్యం ఉన్నాడని నిలకడగా ఉందన్నారు. ప్రముఖ డాక్టర్లతో ఆయనను పరిశీలించినట్టు తెలిపారు. అయితే ఆయన సమాధి గురించ తమకు తెలియదని పేర్కొనడం విశేషం.