command control building
-
‘కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులన్నీ ఫిబ్రవరి 15 లోపు పూర్తవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో నిర్మాణం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ఫిబ్రవరి 15 వరకు పూర్తవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అదేశించారు. ఫిబ్రవరి నెలలో మెయిన్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ భవన పనులను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. అనంతరం ఆయన ఆర్అండ్బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఇతర అధికారులతో కలిసి రివ్యు సమావేశాన్ని నిర్వహించారు. భవనానికి కావాల్సిన ఫర్నిచర్ పై ఆయన పరిశీలించడంతో పాటు పెండింగ్ పనులన్నీ ఫిబ్రవరి 15 లోపు పూర్తవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
కమాండ్ కంట్రోల్ భవనానికి శంకుస్థాపన
-
కమాండ్ కంట్రోల్ భవనానికి శంకుస్థాపన
హైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ భవనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం ఆయన భూమి పూజ చేశారు. 302 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవాన్ని నిర్మిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.