వెంకన్నకు విదేశీ బైక్ కానుక
తిరుమల: అమెరికాలో తయారైన కమాండో మోటార్ సైకిల్ తిరుమలేశునికి ఆదివారం కానుకగా అందింది. రూ.2 లక్షల విలువైన ఈ ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్లోని ఫోన్సిక్స్ సంస్థలకు చెందిన చుక్కలపల్లి సురేష్ విరాళంగా సమర్పించారు. ఈ వాహనాన్ని తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుకు అందజేశారు. దాత విజ్ఞప్తి మేరకు జేఈవో కొంత దూరం బైక్ నడపడం విశేషం.