చెక్‌పోస్ట్ పై ఏసీబీ దాడులు
నాగాలపురం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా నాగాలపురం కమర్షియల్ చెక్‌పోస్ట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం తిరుపతి ఏసీబీ అధికారి శంకర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ. 39,889లు అదనంగా కలిగి ఉన్నట్లు గుర్తించారు. కాగా తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.