Commercial Court
-
కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్‌షాట్స్ వైరల్
బీటౌన్ దర్శక నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో ఒకరు కరణ్ జోహార్. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ పేరిట తాజాగా నిర్మించిన చిత్రం 'జుగ్‌జుగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేందుకు రెడీ అయిన తరుణంలో తాజాగా నిర్మాత కరణ్ జోహార్‌కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే.. తను పంపించిన పాయింట్స్‌ను కాపీ కొట్టి 'జుగ్‌జుగ్ జీయో' సినిమాను నిర్మించారని రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 'బన్నీ రాణీ' అనే టైటిల్‌తో కొన్ని పాయింట్స్‌ను ధర్మ ప్రొడక్షన్స్‌కు పంపించినట్లు ఆయన తెలిపాడు. తర్వాత ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చిందని, అయితే ఆ పాయింట్స్‌ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని, తీరా చూస్తే ఆయన పాయింట్స్‌తో ఈ మూవీ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ తర్వాత ఇరువైపులా వాదనలు విని, కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో చెబుతామని వెల్లడించింది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కరణ్ జోహార్ అధికారికంగా స్పందించలేదు. కాగా 'జనవరి 2020లో బన్నీ రాణీ టైటిల్‌తో కథ రిజిస్టర్ చేసుకున్నా. 2020 ఫిబ్రవరిలో సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం కోసం ధర్మ ప్రొడక్షన్స్‌కు మెయిల్ చేశా. నాకు రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత వాళ్లు నా స్టోరీ తీసుకున్నారు. జుగ్‌జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారు. ఇది సరికాదు కరణ్ జోహార్.' అని విశాల్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తోపాటు విశాల్ పంపించిన పాయింట్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
త్వరలో వాణిజ్య కోర్టులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య లావాదేవీల్లో నెలకొనే వివాదాల పరిష్కారం కోసం కేంద్రప్రభుత్వం త్వరలో కమర్షియల్ కోర్టులను ఏర్పా టు చేయనున్నట్టు ప్రజావినతులు, చట్టాలు, న్యాయంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈఎమ్ సుదర్శన నాచియప్పన్ తెలిపారు. వాణిజ్యకోర్టుల ఆవశ్యకత, లోక్‌సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధివిధానాలపై చర్చిం చేందుకు సుదర్శన కమిటీ శుక్రవారం ఇక్కడ సమావేశమైంది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐలతోపాటు, వివిధ సంస్థల వారు హాజరై సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం కమిటీ చైర్మన్ సుదర్శన నాచియప్పన్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయని, అంతేస్థాయిలో సమస్యలు, వివాదాలు కూడా నెల కొంటున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారం కోసం వాణిజ్య న్యాయస్థానాలు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. విధివిధానాల అధ్యయనానికి తమ కమిటీ దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు. జూలై నెలాఖరుకు కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో కోటి కేసులు బ్యాంకులు, పబ్లిక్సెక్టార్కు సంబంధించినవి కాగా, మిగిలినవి ప్రైవే ట్ సెక్టార్‌కు చెందినవని తెలిపారు. తెలంగా ణ, ఏపీతో పలు రాష్ట్రాల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటు జరుగుతున్నాయని, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కేంద్రం ఆలోచన చేస్తుం దని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు వి.వరప్రసాదరావు, పీపీ చౌధురి, రజనీపాటిల్, చౌధురి మహబూబ్ ఆలీ కైసర్, సంతోష్‌కుమార్, డా.అన్షుల్ వర్మ, సుఖ్యింద్ శేఖర్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.