3వ తరగతి నుంచే హాస్టల్
* త్వరలో కేజీ నుంచి పీజీపై నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘కేజీ టు పీజీ’లో భాగంగా హాస్టల్ సదుపాయంతో కూడిన ఇంగ్లిషు మీడియం ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముసాయిదా నివేదికను విద్యాశాఖ రూపొందించింది.
వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించే ఈ స్కూల్‌ను 15 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఈ పథకంపై అధికారులతో చర్చించారు. 3వ తరగతి నుంచి హాస్టల్ సదుపాయం కల్పించడం మంచిదనే భావన ఇందులో వ్యక్తమైంది.