Commodity Derivatives
-
ఎన్ఎస్ఈలో చమురు, గ్యాస్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: నైమెక్స్ క్రూడ్, నేచురల్ గ్యాస్‌లలో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్టులకు తెరతీసింది. దీంతో ఎన్ఎస్ఈ ఎనర్జీ బాస్కెట్లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్ హెడ్జింగ్‌కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్ చేసేందుకు ఎన్ఎస్ఈ సీఎంఈ గ్రూప్‌తో డేటా లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
కమోడిటీ డెరివేటివ్స్‌లోకి విదేశీ సంస్థలకు అనుమతి
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్‌కు విదేశీ సంస్థలను అనుమతించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిర్ణయించింది. భారత్‌లో కమోడిటీ మార్కెట్‌తో (ఫిజికల్ మార్కెట్) లావాదేవీలు (ఎగుమతులు/దిగుమతులు) జరిపే విదేశీ సంస్థలను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి అనుమతించాలని సెబీ నిర్ణయం తీసుకుంది. కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసే వ్యూహంలో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కమోడిటీ మార్కెట్‌తో లావాదేవీలు జరిపే విదేశీ సంస్థలు ధరల అనిశ్చితి సమస్యను ఎదుర్కొం టాయని సెబీ పేర్కొంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ధరల నష్ట భయాన్ని హెడ్జింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం కోసం, సదరు విదేశీ సంస్థలను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి అనుమతించాలని నిర్ణయించినట్లు సెబీ వివరించింది. -
కమోడిటీల్లో కూడా ఆప్షన్ ట్రేడింగ్
మరో 6 కమోడిటీల్లోనూ ట్రేడింగ్‌ను అనుమతించిన సెబీ న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్‌ల మార్కెట్‌ను మరింతగా విస్తరించే రెండు నిర్ణయాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ బుధవారం తీసుకుంది. కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌ను అనుమతించింది. అంతే కాకుండా మరో ఆరు కమోడిటీల్లో ట్రేడిం గ్ను ప్రారంభించింది. వజ్రాలు, టీ, గుడ్లు, కోకో, దుక్క ఇనుము, ఇత్తడి.. ఈ ఆరు కమోడిటీల్లో ట్రేడింగ్‌ను అనుమతిస్తున్నామని సెబీ పేర్కొంది. దీంతో కమోడిటీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్‌కు అనుమతించిన కమోడిటీల సంఖ్య 91కు పెరిగింది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చాంద్ అధ్యక్షతనగల నిపుణల కమిటీ సూచనలు, సెబీతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం కొత్తగా ఈ ఆరు కమోడిటీల్లో ట్రేడింగ్‌ను అనుమతించింది.