న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్‌కు విదేశీ సంస్థలను అనుమతించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిర్ణయించింది. భారత్‌లో కమోడిటీ మార్కెట్‌తో (ఫిజికల్ మార్కెట్) లావాదేవీలు (ఎగుమతులు/దిగుమతులు) జరిపే విదేశీ సంస్థలను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి అనుమతించాలని సెబీ నిర్ణయం తీసుకుంది.
కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసే వ్యూహంలో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కమోడిటీ మార్కెట్‌తో లావాదేవీలు జరిపే విదేశీ సంస్థలు ధరల అనిశ్చితి సమస్యను ఎదుర్కొం టాయని సెబీ పేర్కొంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ధరల నష్ట భయాన్ని హెడ్జింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం కోసం, సదరు విదేశీ సంస్థలను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి అనుమతించాలని నిర్ణయించినట్లు సెబీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment