Communist Party of India Marxist
-
Lok Sabha Election 2024: మట్టిమనిషి!
జహనారా ఖాన్. పశి్చమబెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానంలో సీపీఎం అభ్యర్థి. బొగ్గు గని కార్మికుని కూతురు. రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగిన సాదాసీదా మహిళ. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మట్టి బిడ్డ. జమూరియా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా, ఎస్ఎస్ అహ్లువాలియా వంటి దిగ్గజాలకు గట్టిపోటీ ఇస్తున్నారు... చిన్న స్థాయి నుంచి... జహనారా తండ్రి మైనింగ్ కార్మికుడు. సీపీఎం నాయకుడు. ఆమె జమూరియాలోని రాణిగంజ్ మహిళా కాలేజీలో చదువుకున్నారు. 1990లో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటికీ ఈసీఎల్‌లో ఒక చిన్న పాత ఇంట్లో తోబుట్టువులతో కలసి ఉంటారామె. జహనారా వృత్తి రీత్యా టీచర్. వెనకబడిన కుటుంబాల్లోని చిన్నారులు, యువత జీవితాల్లో వెలుగు నింపేందుకు పాతికేళ్ల కిందే బాల్ బోధన్ శిక్షా నికేతన్ పేరిట హిందీ మీడియం స్కూలు ప్రారంభించారు. జమురియాలోని దక్షిణ పరాసియా మైనింగ్ ప్రాంతంలో ఉందీ స్కూలు. ఇందులో చదువుకున్న వాళ్లే ఇప్పుడు టీచర్లుగా స్వచ్ఛందంగా పని చేస్తుండటం విశేషం. అనంతరం తండ్రి రాజకీయ బాటలో నడిచి తొలుత సీపీఎం యువజన సంఘంలో పని చేశారు. జమూరియా మహిళా సంఘ నాయకురాలిగా ఎదిగారు. జమూరియా పంచాయతీ ప్రధాన్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2008లో జమురియా పంచాయతీ అధ్యక్షురాలయ్యారు. తృణమూల్ హవా సాగుతున్న 2011, 2016ల్లో వరుసగా రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఆమెకున్న ఆదరణకు నిదర్శనం. స్థానికంగానూ అత్యంత శక్తిమంతురాలైన నాయకురాలిగా ఎదిగారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జమూరియా నుంచి విద్యార్థి నాయకురాలు అయిషీ ఘోష్‌కు సీపీఎం టికెటిచి్చంది. దాంతో జహనారా పార్టీ కార్యకలాపాలపై, పాఠశాలపై దృష్టి సారించారు. తొలిసారిగా ఇప్పుడు లోక్‌సభ బరిలో దిగుతున్నారామె. కారి్మకుల కుటుంబాలు అధికంగా ఉండే అసన్సోల్లో ఆమె గెలుపు తథ్యమని సీపీఎం భావిస్తోంది. పోరాడేవారే గెలుస్తారు... నటులు, గాయకులతో ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు రాదంటారు జహనారా. కారి్మకులు, ప్రజల పక్షాన పోరాడే సీపీఎం తప్పక విజయం సాధిస్తుందని ఆమె నమ్ముతున్నారు. ‘‘రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోంది. మహిళలు సురక్షితంగా లేరు. 2011 పార్క్ స్ట్రీట్ సంఘటన నుంచి, నేటి సందేశ్‌ఖాలీ వరకూ మహిళలు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. బెంగాల్ ఆడపిల్లలను తృణమూల్ ప్రభుత్వం సరుకులుగా మార్చింది. రాష్ట్రమంతటా మహిళలపై జరుగుతున్న అణచివేతపై నిరసన, ప్రతిఘటన అగి్నజ్వాలగా మారుతోంది. సమస్యల పరిష్కారంలో తృణమూల్, బీజేపీలు విఫలమయ్యాయి’’ అని విమర్శిస్తున్నారు. పదేళ్లుగా కోల్పోయిన అసన్సోల్ ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టడం తన బాధ్యత అని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌బై.. 17 స్థానాల్లో ఒంటరి పోరుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌బై చెప్పింది. అడిగిన సీట్లు ఇవ్వలేదంటూ ఒంటరి పోరుకు సిద్ధమైంది. 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా పొత్తులు, అభ్యర్థులపై కాంగ్రెస్‌కు సీపీఎం ఇచ్చిన డెడ్‌లైన్ దాటిపోవడంతో పోటీ చేసే స్థానాల జాబితాను ప్రకటించింది. 17 మందితో కూడిన సీపీఎం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం గురువారం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, హైదరాబాద్ జిల్లాలో సీపీఎం పోటీ ఉంటుందని తమ్మినేని వెల్లడించారు. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హూజుర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్‌తో కూడిన జాబితాను విడుదల చేశారు. భద్రాచలంలో 8సార్లు వరుసగా గెలిచామని తమ్మినేని తెలిపారు. పాలేరు, భద్రాచలం సీటు కావాలని తాము పట్టుపడితే కాంగ్రెస్ ఇవ్వలేదని మండిపడ్డారు. భద్రాచలం, సత్తుపల్లి, పాలేరు సిట్టింగ్ కాబట్టి ఇవ్వబోమన్నారని తెలిపారు. వైరా, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో ఇస్తామని చెప్పారన్నారు. తాము అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే సీట్లకు చెప్పినా కూడా పొత్తు విషయంలో కాంగ్రెస్ మాట మార్చిందని దుయ్యబట్టారు. తమకు ఇస్తామన్న సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. చర్చల సమయంలో ఎన్నో మెట్లు దిగి మాట్లాడామని, ఇంత అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి ఉండాలా విడిపోవాలా అన్నది సీపీఐ ఇష్టమని తమ్మినేని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ సీపీఐకి రెండు టికెట్లు ఇస్తే.. అక్కడ పోటీ పెట్టబోమని తెలిపారు. సీపీఐ నిలబడే స్థానాల్లో వారకే సీపీఎం మద్దతిస్తుందన్నారు. మిత్రుత్వంతో చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలన్న ఆయన.. పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. చదవండి: చెన్నూరు నుంచి వివేక్..ఎంపీగా కొడుకు పోటీ! కమ్యూనిస్టుల ప్రాధాన్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిగా ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. నిన్న భట్టి ఫోన్ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం వరకు ఎదురుచూశామని, అనివార్య పరిస్థితుల్లో విడిగా వెళ్లడానికే నిర్ణయంచుకున్నామని తెలిపారు. బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్ను కూడా సపోర్టు చేస్తామన్నారు. అసెంబ్లీలో పేదల గొంతు వినిపించాలంటే సీపీఎంను గెలిపించాలని, కమ్యూనిష్టులు లేని శాసన సభలు దేవుడి లేని దేవాలయాలుగా ఉంటాయన్నారు. ‘పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ అనుకుంటుంది. పొత్తుల బ్రేకప్ మేము కోరుకుంది కాదు. ఏమెల్సీలు, మంత్రి పదవులు తీసుకోవడం సీపీఎం పార్టీ విధానం కాదు. సీపీఎం ఆనాడే ప్రధాని పదవిని సూత్రప్రాయంగా వదిలివేశాము. దాదాపు 24 సీట్లకు ప్రతిపాదనలు వచ్చాయి. కార్యవర్గంలో చర్చించి మరో రెండు మూడు సీట్లు ప్రకటిస్తాం. ఈ ప్రకటించిన సీట్లలో మార్పులు జరిగే అవకశాలున్నాయి. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదరకపోతే మార్పులు ఉంటాయి. అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం. బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ ఓడిపోయే సీట్లలో ఎవరు ఓడించే వారైతే వాళ్లకు ఓటు వేస్తాం. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా’ అని తమ్మినేని పేర్కొన్నారు. -
సీమ అభివృద్ధికి పోరుబాట
అఖిలపక్షం, ప్రజా సంఘాలు కలసి రావాలి కర్నూలు(రాజ్‌విహార్): రాయలసీమ అభివృద్ధికి తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. వచ్చే నెలలో నిర్వహించనున్న ఆ పార్టీ 21వ అఖిల భారత మహాసభల సందర్భంగా బుధవారం స్థానిక సి.క్యాంప్ సెంటర్లోని లలిత కళాసమితిలో ‘రాయలసీమ అభివృద్ధి- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన బడ్జెట్లో అందుకు తగ్గట్లు నిధులు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. కేంద్రం వెనుకబడిన ప్రాంతాల పేరుతో జిల్లాకు కేంద్రం ఇచ్చిన రూ.50కోట్ల నిధులు ఏ మూలకు ఖర్చు చేసుకోవాలని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యక హోదాను తెప్పించడంలో విఫలమయ్యారన్నారు. సీమ అభివృద్ధికి తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనలకు అఖిల పక్షం, ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలం చెందారని, పరిశ్రమలను రాజధాని చుట్టూ నిర్మించకుండా వెనుకబడిన జిల్లాల్లో నిర్మిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధిలోకి వస్తాయన్నారు. పట్టిసీమ నీటిని రాజధాని ప్రాంతాలకు తరిలించేందుకే సర్కారు కసరత్తు చేస్తోందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ.గఫూర్ మాట్లాడుతూ రాజధాని పేరుతో లాక్కునే భూముల్ని సింగపూర్ సంస్థలకు అప్పగించేందుకు ఒప్పందం జరిగిందన్నారు. 33వేల ఎకరాలు అవసరం లేదని తమ పార్టీ చెబుతున్నా పట్టించుకోవకపోవడం విచారకరమన్నారు. సదస్సులో రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, కమిటీ సభ్యులు రామకృష్ణ, కె.వి.సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.