The concerns of farmers
-
మహదాయి హింసాత్మకం !
రోజురోజుకూ తీవ్రమవుతున్న రైతుల పోరాటం ధార్వాడ బంద్‌లో చెలరేగిన అల్లరి మూకలు గోవా బస్సుకు నిప్పు దుకాణాలపై రాళ్లు బెంగళూరు: మహదాయి నది అనుసంధానంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళనలు ఇప్పుడు హింసాత్మకంగా మారుతున్నాయి. కళసా బండూరి కాలువా పథకంతో పాటు మహదాయి న ది అనుసంధానంపై గత కొన్ని రోజులు గా హుబ్లీ-ధార్వాడ, గదగ్ జిల్లాల్లోని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ అంశంపై అఖిలపక్షం ప్రధాని నరేంద్రమోదీతో నిర్వహించిన సమావేశం విఫలమైన నేపథ్యంలో ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అంతేకాక అఖిలపక్షం ప్రధానితో జరిపిన సమావేశం విఫలమైన నేపథ్యంలో బుధవారం నిర్వహించిన హుబ్లీ-ధార్వాడ బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో హుబ్లీ-ధార్వాడ జిల్లా లో పూర్తిగా జనజీవనం స్తంభించింది. బంద్ సందర్భం లో కొన్ని అల్లరిమూకలు చెలరేగాయి. ఇక ఇదే సందర్భంలో ధార్వాడలోని బస్టాండ్‌లో ఆగి ఉన్న గోవాకు చెందిన బస్‌కు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో బస్ పూర్తిగా దగ్దమైంది. ఇదే సందర్భంలో కొంతమంది ఆందోళనకారులు దుకాణాలపై రాళ్లురువ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్తంభించిన రవాణా..... బంద్ నేపథ్యంలో ధార్వాడ జిల్లా వ్యాప్తంగా రవాణా స్తంభించింది. జిల్లాలోని కలఘటగి, కుందగోళ, నవల గుంద, నరగుంద పట్టణాలతో పాటు ఇతర అన్ని ప్రాం తాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇక బంద్ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ బస్‌లతో పాటు టెంపోలు, జీప్‌లు వంటి ప్రైవేటు రవాణా సైతం స్తంభించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. తెల్లవారుఝామున కొన్ని ప్రాంతాల్లో ఆటో సంచారం కనిపించినా, టికెట్ ధరను మూడింతలు చేసి ప్రయాణికుల నుంచి వసూలు చేయడంతో ప్రజల జేబులకు చిల్లు తప్పలేదు. -
ఆంక్షలపై ఆగని ఆందోళనలు
* మూడు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతులు * షర తుల్లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ నిజామాబాద్/ఆదిలాబాద్/కరీంనగర్, న్యూస్‌లైన్: రుణ మాఫీపై ఆంక్షలను నిరసిస్తూ శుక్రవారం కూడా రైతులు ఆందోళనలు చేపట్టారు. షరతులు లేకుండా పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రాస్తారోకో, ధర్నాలు చేశారు. రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. పలుచోట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, పెర్కిట్ శివారులో రైతులు రోడ్డుపై బైఠాయించారు. నందిపేట, కామారెడ్డి, సదాశివనగర్ మండలం లింగంపేటలలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఖోడథ్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును రైతులు ఘెరావ్ చేశారు. దండేపల్లి మండలం ముత్యంపేటలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో రైతులు ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ వాహనాన్ని అడ్డుకుని.. ఘెరావ్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు, కథలాపూర్ మండలం చింతకుంటలో రైతులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు నిప్పంటిం చారు. కాగా రుణాల మాఫీ ఆంక్షలపై మనస్థాపం చెంది మెదక్‌జిల్లా జహిరాబాద్ మండలం ఖాశీంపూర్కు చెందిన దత్తాత్రి (55), అలాగే కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం మాదాపూర్‌కు చెందిన స్వామిరెడ్డి(50)లు గుండెపోటుతో మరణించారు.